Breaking News

వీధి కుక్కల వీరంగం

Published on Sun, 06/23/2024 - 07:02

మణికొండ: వాకింగ్‌ కోసం ఇంట్లోంచి బయటకు వచ్చిన ఓ మహిళను వీధి కుక్కలు వెంటపడి తరిమాయి. ఏకంగా పదికి పైగా కుక్కల గుంపు ఆమెను చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశాయి. కుక్కల బారి నుంచి తప్పించుకుంటూ ఆ మహిళ వంద అడుగుల దూరం వరకు వెళ్లింది. అయినా అవి వెంటపడి మరీ తరమడంతో మహిళ అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో అవి ఒక్కసారిగా ఆమెపై పడ్డాయి. 

అదే సమయంలో అటువైపుగా స్కూటీపై వచ్చిన వ్యక్తి వద్దకు సదరు మహిళ పారిపోయి కుక్కల బారి నుంచి తప్పించుకున్న ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. చిత్రపురి కాలనీకి చెందిన రాజేశ్వరి రోజు మాదిరిగానే శనివారం ఉదయం 6 గంటలకు వాకింగ్‌ నిమిత్తం ఇంట్లోంచి బయటకు వచి్చంది. అదే సమయంలో పదుల సంఖ్యలో ఉన్న కుక్కలు ఒక్కసారిగా ఆమె వెంట పడ్డాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆమె విశ్వ ప్రయత్నాలు చేసింది. వాటి కాటుకు బలి కాకుండా తప్పించుకోగలిగింది.  

తిండి కోసం ఎదురు చూస్తుండగా..  
కాలనీ వాసులు ముందు రోజు మిగిలిపోయిన ఆహారాన్ని కుక్కల కోసం వీధుల్లో పెడుతున్నారు. దీంతో ప్రతిరోజూ ఉదయం కుక్కలు ఆకలితో అక్కడికి చేరుకుంటున్నాయి. శనివారం కుక్కల బారిన పడిన మహిళ సైతం తమకు ఆహారం పెట్టేందుకే వచ్చి ఉంటుందని కొద్ది సేపు వెంటపడినట్టు సీసీ టీవీలలో రికార్డు అయ్యింది. ఎంతకూ అన్నం పెట్టకపోయేసరికి మహిళ వెంట పడ్డాయని కాలనీ వాసులు భావిస్తున్నారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)