Breaking News

అత్యాచారం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌.. విచారణలో షాకింగ్‌ విషయాలు చెప్పిన యువతి

Published on Fri, 04/18/2025 - 15:49

హైదరాబాద్‌: MMTS రైలులో అత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. మార్చి 22వ తేదీన MMTS రైలులో తనపై అత్యాచారం జరిగిందంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదు అంతా ఫేక్‌ అని తేలింది. అత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. అసలు అత్యాచారమే జరగలేదని కేసును క్లోజ్ చేశారు. పోలీసులను  సదరు యువతి తప్పుదోవ పట్టించిందని, దాంతో కేసును మూసివేశారు.

ఇన్ స్టా రీల్స్ చేస్తూ కిందపడి..
ఆ యువతి ఇన్ స్టా రీల్స్ చేస్తూ MMTS రైలు నుంచి కిందపడింది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ఓ డ్రామాకు తెరలేపింది. పోలీసులకు అనుమానం రాకుండా వారిని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. తనపై అత్యాచారం జరగబోయిందని, అందుకే రైలు నుంచి దూకేసినట్లు ఫిర్యాదు చేసింది.

250 సీసీ కెమెరాలతో జల్లెడపట్టిన పోలీసులు
అత్యాచారం జరిగిందంటూ యువతి చేసిన ఫిర్యాదును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆమె ఆ క్షణంలో తప్పించుకుని బయటపడితే, పోలీసులు మాత్రం దర్యాప్తును లోతుగా చేపట్టారు. 250 సీసీ కెమెరాలతో జల్లెడు పట్టి మరీ అత్యాచారం ఎలా జరిగిందనే కోణాన్ని పరిశీలించారు. 

దీనిలో భాంగా 100 మంది అనుమానితులను ప్రశ్నించారు పోలీసులు. చివరకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ యువతిని మరొకసారి విచారించారు. చివరకు విచారణలో తనపై ఎటువంటి అత్యాచార యత్నం జరగలేదని తెలిపింది. కేవలం రీల్స్ చేస్తూ కిందపడిపోవడంతో ఆ రకంగా అబద్ధం చెప్పానని ఒప్పుకుంది సదరు యువతి. 

కాగా, గత నెల 22వ తేదీన ఎంఎంటీఎస్‌ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగిందనే వార్త నగరంలో కలకలం రేపింది.  ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది  ఆ యువతి. రైలు నుంచి కిందపడి గాయాల పాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుంది.  

అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్‌లోని ఒక ఉమెన్స్‌ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. మార్చి 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్‌ రిపేర్‌ చేయించుకునేందుకు సికింద్రాబాద్‌కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తెల్లాపూర్‌– మేడ్చల్‌ ఎంఎంటీఎస్‌ రైలు ఎక్కింది. ఈ క్రమంలోనే రీల్స్‌ చేస్తూ కింద పడింది. అయితే ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అత్యాచారం డ్రామాకు తెరలేపింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)