Breaking News

HYD: హనీట్రాప్‌.. అందమైన రూపంతో ఎర.. ఒంటిపై నూలుపోగు లేకుండా వీడియో కాల్‌!

Published on Fri, 02/17/2023 - 08:01

సాక్షి, హైదరాబాద్‌: ఓ అందమైన యువతి అనుకోకుండా వీడియో కాల్‌ చేయడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆమె మాయలో పడ్డాడు. మాయలేడి మాయ మాటలు చెప్పి ఆయనను పీకల్లోతు ప్రేమలోకి తీసికెళ్లింది. కట్‌ చేస్తే ఆ వీడియోను అడ్డం పెట్టుకుని రూ.లక్షలు కాజేసింది. ఆ వీడియో బయటకు వస్తే తన పరువుపోతుందని భావించిన అతను తనకు న్యాయం చేయాలని కోరుతూ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చంపాపేటకు చెందిన వ్యక్తి ఓ ప్రభుత్వోద్యోగిగా పని చేస్తున్నాడు. విధుల్లో ఉన్న ఆయనకు ఓ నంబర్‌ నుంచి వీడియో కాల్‌ వచ్చింది. దానిని లిఫ్ట్‌ చేయగా అవతలి వైపు అందమైన  అమ్మాయి కనిపించింది. మీతో స్నేహాన్ని పంచుకోవాలనుకుంటున్నానంటూ తియ్యని మాటలతో అతడిని రెచ్చగొట్టింది. ఇంటికెళ్లిన తర్వాత కాల్‌ చేస్తానంటూ చెప్పి అతను కాల్‌ కట్‌ చేశాడు. రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటరిగా సదరు యువతికి కాల్‌ చేశాడు. వీడియో కాల్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకున్నారు.

ఆ తర్వాత కొద్ది సేపటికే ఓ వ్యక్తి కాల్‌ చేసి పోలీసునని పరిచయం చేసుకున్నాడు. మీరు ఓ యువతిని భయపెట్టి ఆమెతో అసభ్యకరంగా వీడియో కాల్‌ మాట్లాడారని, మేం చెప్పినట్లు వినకపోతే వీడియోకాల్‌ను సోషల్‌ మీడియాలో పెట్టడమే కాక కేసు ఫైల్‌ చేస్తామన్నారు. ఈ విషయం బయటికి వస్తే తన పరువు పోతుందనే భయంతో అతను వారికి రూ.5లక్షలు ముట్టజెప్పాడు. ఇంకా కావాలని ఫోన్‌ చేసి వేధిస్తుండటంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  
చదవండి: హైదరాబాద్‌ పేలుళ్ల కుట్రకోణంలో కొత్త మలుపు

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)