Breaking News

ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!

Published on Sun, 12/07/2025 - 13:28

హైదరాబాద్‌: గోవాకు వెళ్లిన ఓ జంట కలిసి ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలను రహస్యంగా తీసి రూ.30 లక్షలు డిమాండ్‌ చేస్తున్న గోవాకు చెందిన ఓ వ్యక్తిపై సనత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డకు చెందిన ఓ మహిళ (35) తన వివాహం కాకముందు 2023లో శ్రీనాథరావు అనే వ్యక్తితో కలిసి గోవాకు వెళ్లింది. వీరికి గోవాలోని  యశ్వంత్‌ (40) అనే వ్యక్తి వసతితో పాటు ఇతర ఏర్పాట్లను చేశాడు. అదే సమయంలో ఆ జంట కలిసి ఉన్నప్పటి వీడియోలను రహస్యంగా తీశాడు. 

ఈ వీడియోలను భద్రపరిచిన యశ్వంత్‌ తాజాగా శ్రీనాథరావుకు ఫోన్‌ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. తనకు రూ.30 లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. ఇదిలా ఉండగా సదరు మహిళకు గత ఏడాది వేరొకరితో పెళ్లి జరిగింది. ఈ క్రమంలో తనకు వచ్చిన బెదిరింపుల విషయాన్ని శ్రీనాథరావు ఆ మహిళ దృష్టికి తీసుకువచ్చాడు. భయాందోళనకు గురైన బాధితురాలు సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు యశ్వంత్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)