Breaking News

వరకట్న .. వేధింపులు తాళలేక..

Published on Mon, 02/03/2025 - 11:13

హైదరాబాద్‌, ఉప్పల్‌: వరకట్న వేధింపులు తాళలేక  ఓ మహిళ  ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన  ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా, మోత్కూరు మండలం,  పాటిమట్ల గ్రామానికి చెందిన భోరెడ్డి రాజశేఖర్‌ రెడ్డికి గుండాల మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన  మలిపెద్ది రవళి(25)తో 2019లో వివాహం జరిగింది. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చిన వారు ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. 

వారికి  ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా రవళిని అత్తమామలు, ఆడబిడ్డలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. పలు మార్లు పెద్ద మనుషులు జోక్యం చేసుకుని నచ్చజెప్పినా వారి వైఖరి మారలేదు. ఏడాది క్రితం రాజశేఖర్‌ రెడ్డి భార్యను వదిలేసి స్వగ్రామానికి వెళ్లి పోయాడు. అప్పటి నుంచి రవళి ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి లోనైన ఆమె శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. వరకట్న వేధింపుల కారణంగానే తన కుమార్తె అత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి రజిత ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. గత కొంత కాలంగా పిల్లలిద్దరూ తండ్రి వద్దనే ఉంటున్నట్లు సమాచారం.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)