Breaking News

Jagtial: మొన్న తల్లి.. నేడు పిల్లలు

Published on Mon, 02/17/2025 - 08:15

పెగడపల్లి (జగిత్యాల జిల్లా) : ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి.. తానూ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన విషాదాంతంగా ముగిసింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ తల్లి శుక్రవారం మృతిచెందగా.. పిల్లలు కృష్ణంత్‌ (10), మయాంతలక్ష్మి (8) ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కన్నుమూశారు. పిల్లల మృతదేహాలను స్వగ్రామమైన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి తరలించారు. కాగా, తమ అల్లుడు తిరుపతి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు అదనంగా కట్నం తేవాలని వేధించినందుకే తమ కూతురు ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుందని హారిక తల్లిదండ్రులు అల్లెం మల్లయ్య, పోచవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్‌ తెలిపారు. 

కుటుంబ సభ్యుల ఆందోళన..
పిల్లల మృతదేహాలను ఆదివారం మధ్యాహ్నం మద్దులపల్లికి తీసుకొచ్చారు. అప్పటికే హారిక కుటుంబ సభ్యులు, బంధువులు మద్దులపల్లికి తరలివచ్చారు. హారికతోపాటు పిల్లల మృతికి తిరుపతే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని హారిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. అప్పటివరకు పిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు చేయమని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అక్కడికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రవి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య పిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు.  

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగి..


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)