అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
Published on Tue, 09/10/2024 - 07:34
సనత్నగర్: భవనంపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బేగంపేట ఎస్ఐ జయచందర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన హరీష్ జి ప్రభు ఎస్బీఐలో ఏజీఎంగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య రంజిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చెన్నై నుంచి జులైలో హైదరాబాద్కు బదిలీపై వచి్చన ఆయన బేగంపేట ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీలోని కోరల్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు.
కాగా గత ఏప్రిల్లో రంజిత తల్లి మృతి చెందడంతో అప్పటి నుంచి మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం అపార్ట్మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆమె భర్త హరీష్ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. మానసిక సమస్యలతో తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags : 1