HYD: ప్రేమ పేరుతో సహజీవనం.. రూ. 8 లక్షలు తీసుకొని మరో యువతితో పెళ్లి

Published on Sun, 02/12/2023 - 16:20

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమ పేరుతో లైంగిక దాడికి పాల్పడి పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేశాడు. అనంతరం ఉపాధి వెతుక్కుంటానని రూ. 8 లక్షలు తీసుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి అప్పటికే మరో యువతిని పెళ్లి చేసుకొని మోసగించారు. ఘటనలో ఘరానా మోసగాడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు.

వివరాలివీ... హయత్‌నగర్‌ సమీపంలో ప్రైవేట్‌ హాస్టల్‌ నడుపుతున్న కాశీ స్నేహిత్‌ ప్రణయ్‌ రాజ్‌కు 2011లో యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లుగా సహజీవనం చేశాడు. బోరబండలో జవహర్‌నగర్‌లో గదులు అద్దెకు తీసుకొని ఆమెతో సహజీవనం చేసిన సమయంలోనే తాను వ్యాపారం చేస్తానని ఆమె వద్ద నుంచి దశల వారిగా రూ. 8 లక్షల వరకు వసూలు చేశాడు.

పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేయడమే కాకుండా గతేడాది ఆగస్టు 20న మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తన మాటేమిటని ప్రశ్నిస్తే ఫోన్‌ బ్లాక్‌ చేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి నాలుగు నెలలుగా తిరిగినా అది తమ పరిధి కాదంటూ పట్టించుకోకపోవడంతో షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. అక్కడి పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 376, 420 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: విధి ఆడిన వింత నాటకం.. కొత్త జంట అకాల మరణం

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)