పెళ్లి అన్నాడు, పాప పుట్టాక కాదన్నాడు...

Published on Sat, 03/01/2025 - 12:15

తిరుమలాయపాలెం(ఖమ్మం): అప్పటికే ఒకరి చేతిలో మోసపోయిన ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన దగ్గరి బంధువు పాప జన్మించాక ముఖం చాటేయడంతో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమలాయపాలెంకు చెందిన యువతికి నాలుగేళ్ల క్రితం క్రితం వివాహం జరగగా, 16 రోజులకే భర్త మరో మహిళతో వెళ్లిపోయాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటూ జీవనం సాగిస్తోంది. 

రెండేళ్లుగా ఖమ్మం రూరల్‌ మండలం ఆరెకోడుకు చెందిన మేనత్త కుమారుడు చిర్రా హరీశ్‌ వీరి ఇంటికి వచ్చివెళ్లే క్రమాన ఆమె అంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా దగ్గరయ్యాడు. 

దీంతో ఆమె గర్భం దాల్చి పాపకు జన్మనిచ్చాక తనతో ఎలాంటి సంబంధం లేదని, పాప తనకు పుట్టలేదంటూ హరీశ్‌ బుకాయించాడు. ఈక్రమాన ఆమె మూడు నెలల పాపను తీసుకుని హరీశ్‌ ఇంటికి వెళ్లగా ఆయనతో పాటు తల్లిదండ్రులు, సోదరి ఇంటికి రావొద్దని, వస్తే చంపేస్తామని బెదిరించారు. ఈమేరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కూచిపూడి జగదీష్‌ తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)