Breaking News

Hyderabad: లక్కీ భాస్కర్ కాదు ఇక్కడ .. మగ్గం వర్క్‌ ఆదిలక్ష్మి ..!

Published on Thu, 03/20/2025 - 13:26

హైదరాబాద్: అధిక డబ్బులు, ఉద్యోగాల ఆశచూపింది. అందినకాడికి దండుకుంది. తేరుకున్న బాధితులు ప్రశ్నించడంతో తాను రిటైర్డ్‌ పోలీసు అధికారినంటూ బెదిరింపులకు దిగింది. చివరకు ఆ కిలాడీ లేడీ బ్యాక్‌ గ్రౌండ్‌ చూసి పోలీసులే కంగుతినాల్సి వచ్చింది.

చర్లపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి ఐజీ మింట్, గణేష్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఆదిలక్ష్మి ఆలియాస్‌ శ్రీదివ్యకాలనీలో మగ్గం వర్క్‌ చేసుకుంటూ కూమర్తెతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో తన వద్దకు మగ్గం వర్క్‌ కోసం వచ్చే మహిళలను మచ్చిక చేసుకుని వారికి మాయమాటలు చెప్పి బుట్టలోకి దించింది. రూ.1000 కడితే వారంలో రూ.10వేలు ఇస్తానని, రూ.లక్ష ఇస్తే స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి గంటల వ్యవధిలో రూ.20–25 వేలు అధికంగా ఇస్తానంటూ.. నమ్మబలికి సుమారు 100 మంది మహిళల వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.  

అనుమానం వచ్చి అడిగితే దాటవేస్తూ.. 
ఆమె తీరుపై అనుమానం వచ్చిన కొంతమంది తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మొండికేసింది. డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే తాను రిటైర్డు పోలీసు అధికారినంటూ బెదిరింపులకు దిగింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన మహిళలు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. కానీ పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధ్రువించకపోవడం గమనార్హం.  

పలు కేసుల్లో నిందితురాలు..  
తోటి మహిళలను బురిడీ కొట్టించి రూ.కోట్లు దండుకున్న కిలాడీ లేడిని చర్లపల్లి పోలీసులు అదపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సదరు మహిళపై మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో 2 కేసులు, మరోస్టేషన్‌లో ఇంకో కేసు ఉన్నట్లు తెలుస్తోంది. 

విచారణకు సహకరించడం లేదు.. 
సదరు నిందితురాలి సమాచారం సేకరించి విచారణ జరుపుతున్నా పోలీసులకు సహకరించడం లేదని, పోలీసులను కూడా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు తెలిసింది. మేడిపల్లిలో మగ్గం మిషన్ల కొనుగోళ్లపై అవినీతికి ఆమె పాల్పడిందని, ఈ కేసులో కూడా నిందితురాలని తెలుస్తోంది. 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)