Breaking News

ఆ రెండు రోజులు వైన్స్‌ బంద్‌ : పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

Published on Fri, 09/13/2024 - 13:18

హైదరాబాద్,సాక్షి : నగరంలో గణనాథుల నిమజ్జనాల సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల పాటు వైన్,కల్లు,బార్ షాపులు మూసివేస్తున్నట్లు తెలిపారు.

గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని అన్ని వైన్, కల్లు, బార్ షాపులను మూసివేయాలని  సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 17 ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 18 సాయంత్రం 6 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది.

తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 కింద నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ప్రజల శాంతి, ప్రశాంతతను కాపాడటం లక్ష్యంగా పోలీసు విభాగం స్టార్ హోటళ్లు రిజిస్టర్డ్ క్లబ్‌లలో ఉన్న బార్‌లు మినహా రెస్టారెంట్‌లకు అనుబంధంగా బార్లు సైతం మూసివేయాలని సీవీ ఆనంద్‌ నిర్వాహకులకు స్పష్టం చేశారు. 

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నగరంలోని అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌ల అదనపు ఇన్‌స్పెక్టర్‌లకు అధికారం ఇచ్చినట్లు సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి : కేజ్రీవాల్‌కు బెయిల్‌

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)