ఉద్యోగం కోసం భర్తను చంపిన భార్య అరెస్ట్‌

Published on Wed, 03/12/2025 - 08:36

నల్లగొండ: ప్రభుత్వ ఉద్యోగం కోసం భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌పురాలో నివాసముంటున్న మహ్మద్‌ ఖలీల్‌ నల్లగొండ మండలం చర్లగౌరారం జెడ్పీహెచ్‌ఎస్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.

అతడికి 2007లో అక్సర్‌ జహతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఖలీల్‌ చేస్తున్న అటెండర్‌ ఉద్యోగం తనకు లేదా పిల్లలకు ఇవ్వాలని అతడిని భార్య అక్సర్‌ జహ వేధింపులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24న ఖలీల్‌ అనారోగ్యంతో ఇంట్లో పడిపోయాడని చుట్టుపక్కల వారిని అక్సర్‌ జహ నమ్మించి, ఆటోలో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. ఖలీల్‌కు ఎటువంటి వైద్యం చేయించకుండానే ఇంటికి తీసుకొచ్చింది. అదే రోజు రాత్రి ఖలీల్‌ మృతిచెందాడు.

మరుసటిరోజు ఖలీల్‌ తల్లి అహ్మది బేగం తన కుమారుడి మృతికి కోడలే కారణమంటూ నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ శంకర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో మృతుడి తలపై మారణాయుధాలతో కొట్టడంతో పాటు ముక్కు, నోటిని బలవంతంగా మూయడంతో ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో వన్‌టౌన్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి అక్సర్‌ జహను అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన నేరాన్ని అంగీకరించిందని డీఎస్పీ తెలిపారు. దీంతో ఆమెను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)