Breaking News

భర్తను హత్య చేసిన భార్యకు పదేళ్ల జైలు

Published on Wed, 03/04/2026 - 07:41

రంగారెడ్డి జిల్లా: భర్తను హత్య చేసిన భార్యకు ఎల్‌బీనగర్‌ కోర్డు పది సంత్సరాల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించింది. మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్‌ పద్మశాలిపురంలో నివాసం ఉండే ప్రభుగౌడ్, భార్య లక్ష్మి ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. భార్య లక్ష్మి కల్లు తాగి వస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండేది. 2017 ఏప్రిల్‌ 6వ తేదీన సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. 

అనంతరం రవి వంట చేయాలని భార్యను కోరాడు. ఇందుకు నిరాకరించిన ఆమె తాను పుట్టింటికి వెళ్లిపోతానని బట్టలను సిద్ధం చేసుకొని బయలుదేరింది. అదే సమయంలో మళ్లీ గొడవ పడ్డారు. దీంతో లక్ష్మి కోపంతో రగిలిపోయి రవిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. కేకలు పెడుతూ మంటలతో బయటకు పరుగులు తీసిన రవిని స్థానికులు రక్షించారు. మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. 108 అంబులెన్స్‌లో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్న అతడు చనిపోయాడు. ఇప్పటి మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టగర్‌ పి.జగదీశ్వర్‌ ఆదారాలను ఎల్‌బీనగర్‌లోని కోర్టుకు సమరి్పంచారు. విచారణ అనంతరం లక్ష్మికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.3 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వై.సత్యేంద్ర తీర్పునిచ్చారు.  

గృహ హింస కేసులో ఏడాది.. 
సిటీ కోర్టులు:  గృహహింస కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి మనోరంజన్‌లోని 15వ అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజి్రస్టేట్‌ కోర్టు న్యాయమూర్తి డి.అజయ్‌ కుమార్‌ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలు.. మలక్‌పేట్‌కు చెందిన తౌఫిక్‌ ఖాన్‌ అదే ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్‌ బేగంను 2012లో వివాహం చేసుకున్నాడు. 

వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యం తాగి ఇంటికి వచ్చి విపరీతంగా కొడుతున్నాడని, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని 2018లో సీసీఎస్‌ ఉమెన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇర్ఫాన్‌ బేగం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు చార్జిషీట్‌తో పాటు మనోరంజన్‌ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి డి.అజయ్‌ కుమార్‌ తీర్పు వెల్లడించారు.   

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)