Breaking News

భర్తకు రెండో వివాహం చేసిన భార్య..

Published on Thu, 08/29/2024 - 08:50

మహబూబాబాద్‌ అర్బన్‌ : ఓ భార్య తన భర్తకు దగ్గర ఉండి మరో వివాహం చేసింది. తాను ఇష్టపడుతున్న యువతితో ఏడు అడుగులు వేయించింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని భక్తమార్కండేయ దేవాలయంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన దాసరి సురేశ్, సరిత దంపతులకు కొన్ని ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమారై ఉన్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని భక్తమార్కండేయ గుడి వీధికి చెందిన లాకా పద్మ, వీరస్వామి దంపతుల చిన్న కుమారై సంధ్య వరుసకు సురేశ్‌కు మరదలు అవుతుంది. 

సంధ్య మానసిక దివ్యాంగురాలు. సంధ్యను ఇష్టపడుతున్నట్లు సురేశ్‌ తన భార్య సరితకు చెప్పడంతో ఆమె భర్త రెండో వివాహనికి అంగీకరించింది. దీంతో బుధవారం ఇరువర్గాల పెద్దలు, భార్య సరిత సమక్షంలో పట్టణంలోని భక్తమార్కండేయ దేవాలయంలో వివాహం జరిపించారు. కాగా, భర్తకు రెండో వివాహం జరిపించిన విషయం సోషల్‌ మీడియాలో, జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. దీనిపై సరితను వివరణ కోరగా సంధ్యను తన భర్త సురేశ్‌ ఇష్టపడ్డాడని, సంధ్య మానసిక దివ్యాంగురాలు అన్నారు. పిల్లల మనసత్వం కలదని, తన పిల్లల మాదిరిగానే చూసుకుంటానని చెప్పింది.  

పోలీసులకు ఫిర్యాదు..
వివాహం జరగకముందు సంధ్య సోదరి భర్త నాగరాజు ఉదయం 11 గంటలకు తన మరదలు మానసిక దివ్యాంగురాలు కావొచ్చన్నారు. కానీ రెండో వివాహం చేయడం నేరమని గొడవకు దిగి 100 డయల్‌కు కాల్‌ చేశాడు. బ్లూకోర్టు సిబ్బంది వివాహం జరుగుతున్న ఆలయానికి చేరుకుని ఆధార్‌ కార్డు పరిశీలించారు. పెళ్లికూతురు మేజరని, ఇరువురి ఇష్టపూర్వకంగా వివాహం జరుగుతుందని తెలిపారు. 100 డయల్‌కు కాల్‌ చేసిన వ్యక్తిని మందలించి అక్కడి నుంచి పంపించారు. ఇదిలా ఉండగా రెండో వివాహాన్ని పోలీసులే ప్రోత్సహించారని పలువురు పెద్దలు పేర్కొన్నారు.  

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)