Breaking News

భర్త మటన్‌ కట్టింగ్‌.. ప్రియుడు కిరాణం షాపు.. చివరికి..

Published on Sun, 03/09/2025 - 11:20

సాక్షి, నాగర్‌ కర్నూల్‌/మహబూబ్‌నగర్‌: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య కటకటాల పాలైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు వెల్లడించారు. పాన్‌గల్‌కు చెందిన ఎండీ పర్వీన్‌బేగం 12 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలుకు చెందిన ఎండీ రహమతుల్లాకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. వివాహమైన రెండేళ్లపాటు పాటు కర్నూలులోనే ఉండగా.. సంసారం విషయంలో గొడవలు వచ్చాయి. దీంతో పదేళ్ల క్రితమే భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఆమె తల్లిగారి గ్రామమైన పాన్‌గల్‌కు వచ్చి సంతబజార్‌లో కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త రహమతుల్లా పెయింటింగ్, మటన్‌ కట్టింగ్‌ పనిచేస్తుండగా.. భార్య టైలర్‌ పనిచేస్తుంది. 

ఈ క్రమంలో పక్కనే ఉన్న కిరాణం షాపు నడుపుతున్న కుమ్మరి రాఘవేందర్‌(ఎ1)తో పరిచయం ఏర్పడి.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం పసిగట్టిన రహమతుల్లా ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ తర్వాత కూడా రహమతుల్లా తరుచుగా ఆమెను వేధించేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వారు రహమతుల్లాను హత్య చేయడానికి నిర్ణయించారు. 

ఈ క్రమంలోనే రాఘవేంద్ర తనకు పరిచయం ఉన్న కురుమూర్తితో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 1న తెల్లవారుజామున 4 గంటల సమయంలో కురుమూర్తిని రహమతుల్లా ఇంటికి పంపించి గొర్రెను కోసేది ఉంది అని చెప్పి వెంట తీసుకొని పాన్‌గల్‌ గ్రామ శివారులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలోని కేఎల్‌ఐ కాల్వ దగ్గరకు వెళ్లగా అప్పటికే రాఘవేంద్ర తన బైక్‌పై అక్కడికి వచ్చి హతమార్చారు. 

 చదవండి: తెల్లారితే పెళ్లి.. అంతలోనే బలవన్మరణం

రాఘవేంద్ర రహమతుల్లా గొంతు పిసకగా.. కురుమూర్తి అతని చేతులు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి రహమతుల్లా మృతదేహం, అతని వెంట తెచ్చుకున్న కత్తిని పక్కనే ఉన్న కేఎల్‌ఐ కాల్వలో పడేసి రాఘవేంద్ర, కురుమూర్తి కలిసి మోటార్‌ సైకిల్‌పై వెళ్లిపోయారు. ఈ మేరకు నిందితులు ఉపయోగించిన మోటార్‌ సైకిల్, 3 సెల్‌ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో ఎ1 కుమ్మరి రాఘవేంద్ర, ఎ2 ప్యాట కురుమూర్తి, ఎ3 పర్వీన్‌బేగంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభచూపిన వనపర్తి సీఐ కృష్ణ, స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసులును, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)