Breaking News

ఐదు రోజులుగా భర్త అంత్యక్రియలను నిర్వహించని భార్య

Published on Wed, 10/23/2024 - 09:49

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): ఆస్తి వివాదంతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని యువకు డు ఆత్మహ్యకు పాల్పడ్డాడు. ఆస్తిలో  వాటా ఇవ్వాల్సిందేనని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేపట్టడంతో ఐదు రోజుల తర్వాత అంత్యక్రియలు జరిగాయి. ఈ ఘటన సదాశివపేట మండల పరిధిలోని తంగడపల్లి గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సిరిపురం మణయ్య, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు నవీన్, రాములు, కుమార్తె రజిత ఉన్నారు. గతేడాది చిన్న కుమారుడు నవీన్‌ మృతి చెందాడు. అతడి భార్యకు భూమి ఇవాల్సి వస్తుందని మణయ్య, మణెమ్మ దంపతులు తమ మూడెకరాల భూమిని అల్లుడు హోంగార్డ్‌ మల్లేశం పేరుపై సెల్‌ డీడ్‌ చేశారు. ఈ విషయం తెలిసి భూమిలో సగం వాటా తనకు ఇవ్వాలని పెద్దకుమారుడు రాములు(32) అడిగాడు. 

వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై 18న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అదే రోజు రాత్రి సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్తిలో తమకు వాటా ఇవ్వాలని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మృతదేహం ఐదురోజులుగా ఆస్పత్రిలోనే ఉంది. మంగళవారం సమస్య సద్దుమణగడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మహేష్‌ గౌడ్‌ తెలిపారు.

 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)