Breaking News

భార్య ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేసిందని.. భర్త ఆత్మహత్య

Published on Sat, 07/25/2026 - 08:06

సంగారెడ్డి జిల్లా: ఫోన్‌ నంబర్‌ను భార్య బ్లాక్‌ లిస్టులో పెట్టిందని అవమానంగా భావించిన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండల పరిధిలోని మిన్‌పూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిటు్కల హనుమంతు (29)కు, కొన్యాలకు చెందిన అలివేణి మంగతో వివాహం జరిగింది. ఆమె ఈనెల 21న పుట్టింటికి వెళ్లింది. కాగా ఆమెకు హనుమంతు పదే పదే ఫోన్‌ చేసి యోగ క్షేమాలు తెలుసుకునేవాడు. 

భర్త తరచూ ఫోన్‌ చేస్తుండటంతో విసుగు చెందిన భార్య హనుమంతు ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టింది. హనుమంతు ఫోన్‌ నుంచి భార్యకు ఫోన్‌ కలవకపోవడంతో అన్న బాలయ్య ఫోన్‌తో ప్రయత్నం చేశాడు. బాలయ్య ఫోన్‌ ఎత్తిన అలివేణిమంగ పదే పదే ఫోన్‌ చేస్తుండటంతో భర్త నంబర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టానని విసుగ్గా సమాధానం చెప్పింది. దీంతో బ్లాక్‌లో పెట్టడం అవమానంగా భావించిన హనుమంతు ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. శుక్రవారం ఉదయం హనుమంతు నిద్రలేవకపోవడంతో తలుపులు పగులగొట్టి చూసే సరికి దూలానికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పుల్కల్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)