Breaking News

'నా ముందే అలా చేస్తావా?' రోకలిబండతో భర్త హత్య!

Published on Fri, 07/10/2026 - 12:35

కరీంనగర్‌, కోరుట్ల:  భర్త ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి తనతోపాటు, పిల్లలను వేధిస్తున్నాడని భావించిన భార్య రోకలి బండతో కొట్టి చంపిన ఘటన కోరుట్ల పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల  కథనం ప్రకారం.. అల్లమయ్య గుట్ట ప్రాంతంలో నివసించే ఇప్ప కాశీరాం, రజినీ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం.

కొద్దిరోజుల క్రితం భార్యాభర్తలు కలిసి మద్యం తాగారు. భార్య తనముందే మద్యం తాగిందని మనసులో పెట్టుకున్న కాశీరాం అప్పటినుంచి అతిగా మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడు. ఆ వేధింపులు భరించలేని రజినీ 20రోజుల క్రితం భర్తపై ఎదురుతిరిగింది. చుట్టుపక్కల వారు వచ్చి గొడవ సద్దుమణిగించారు. అప్పటినుంచి ప్రతిరోజూ గొడవ పడుతూనే ఉన్నారు. బుధవారం కుటుంబసభ్యులందరూ కలిసి వనభోజనానికి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత రజినీ తన ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని తన తల్లిగారింటికి పంపించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాశీరాం(35)ను రోకలిబండతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

అనంతరం అయ్యప్ప గుట్ట సమీపంలో ఉండే తల్లిగారింటికి వెళ్లిపోయింది. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితురాలైన రజినీని గురువారం అరెస్టు చేశారు. తండ్రి హత్యకు గురికావడం.. తల్లి కటకటాల్లోకి వెళ్లటంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. కాశీరాం బంధువుల ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మెట్‌పల్లి డీఎస్పీ అడ్లూరి రాములు ఆధ్వర్యంలో రజినీని రిమాండ్‌కు తరలించారు. సీఐ లక్ష్మీ నారాయణ, ఎస్సై చిరంజీవి పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)