ఉరేసుకునేందుకు భార్య యత్నం.. స్టూల్‌ తన్నేసిన భర్త

Published on Mon, 02/02/2026 - 07:45

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్తను బెదిరించి భార్య స్టూలెక్కి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించంది. మద్యం మత్తులో ఉన్న భర్త స్టూలును కాలితో తన్నడంతో ఊపిరి ఆడక మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫిలింనగర్‌కు చెందిన కొండల్‌ కూలీగా పని చేస్తాడు. కొన్నేళ్ల క్రితం అరుణతో వివాహం అయింది. అరుణ ఓ మెడికల్‌ షాపులో పనిచేస్తోంది. కాగా, కొండల్‌ రోజూ మద్యం తాగి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. శనివారం కూడా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అప్పుడే విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భార్యతో గొడవకు దిగాడు. 

ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో కొండల్‌ భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో అరుణ ఆత్మహత్య చేసుకుంటానంటూ స్టూల్‌ వేసుకొని సీలింగ్‌ ఫ్యాన్‌కు చున్నీ బిగించింది. భర్తను బెదిరిద్దామని స్టూలు వేసుకొని ఉరి పె ట్టుకోగా మద్యం మత్తులో ఉన్న కొండల్‌ స్టూల్‌ను తన్నాడు. దీంతో అరుణ ఊపిరి ఆడక మరణించింది. సమాచారం అందుకున్న ఫిలింనగర్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రశ్నించగా అరుణ ఆత్మహత్య చేసుకుందని కొండల్‌ చె ప్పా డు. అయితే మృతురాలి కుమారుడు తన తండ్రి స్టూల్‌ త న్నడం వల్లనే తల్లి మరణించిందని చెప్పడంతో పోలీసులు కొండల్‌ను అదుపులోకి ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)