Breaking News

ఇంట్లో ఆమె.. డ్యూటీలో ఆయన బాస్‌

Published on Sat, 02/08/2025 - 13:11

గజ్వేల్‌: స్పౌజ్‌ ఆప్షన్‌ వల్ల ఒకే చోట ఉద్యోగాలు చేసే అరుదైన అవకాశాన్ని పలువురు దంపతులు దక్కించుకున్నారు. ఒకే కార్యాలయంలో భర్త బాస్‌గా ఉంటే, భార్య కిందిస్థాయి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కోవలోనే  ములుగు ఏడీఏ (అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌(Assistant Director of Agriculture)(గా అనిల్‌ పనిచేస్తుండగా, భార్య ప్రగతి(Pragathi) ఆయన కిందిస్థాయి ఉద్యోగిగా ఏఓ(అగ్రికల్చర్‌ ఆఫీసర్‌)గా పనిచేస్తున్నారు. 2005లో ఏఓగా ఉద్యోగం పొందిన అనిల్‌(anil) ఆ తర్వాతికాలంలో ఏడీఏగా ప్రమోషన్‌ పొందారు. 

2007లో ప్రగతిని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు సైతం 2009లో ఏఓగా ఉద్యోగం వచ్చింది. కొండపాక, సిద్దిపేట, గజ్వేల్‌ ప్రాంతాల్లో పనిచేసిన అనిల్‌ 2021లో ములుగుకు ఏడీఏగా వెళ్లారు. సంగారెడ్డి, సిద్దిపేట భూసార కేంద్రాల్లో పనిచేసిన ప్రగతి 2018 నుంచి ములుగులో ఏఓగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో స్పౌజ్‌ ఆప్షన్‌లో తన భర్త ఏడీఏ రావడంతో ఆమెకు కలిసి వచి్చంది. ఇంట్లో ఆమె బాస్‌ అయితే ఉద్యోగంలో మాత్రం భర్త బాస్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆయన హెచ్‌ఎం.. ఆమె టీచర్‌ 
గజ్వేల్‌ మండలం కొడకండ్లకు చెందిన శ్రీశైలం, సరిత దంపతులు. 2008లోనే టీచర్లుగా ఉద్యోగం సాధించారు. ఇరువురు వివిధ     ప్రాంతాల్లో పనిచేసి ప్రస్తుతం జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒకే చోట పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలో శ్రీశైలం హెచ్‌ఎంగా వ్యవహరిస్తుండగా, సరిత తన భర్త కిందిస్థాయి ఉద్యోగిగా టీచర్‌ విధులను నిర్వహిస్తున్నారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)