Breaking News

ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు

Published on Sun, 12/17/2023 - 04:35

శంషాబాద్‌ రూరల్‌: వచ్చే 25 ఏళ్లలో భారతదేశం మరింత అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’కు శ్రీకారం చుట్టిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన రంగారెడ్డి జిల్లా చిన్నగోల్కొండలో జెండా ఊపి సంకల్ప రథాన్ని ప్రారంభించారు. దేశాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించేందుకు ప్రధాని మోదీ సంకల్పించారని, ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరేలా.. అర్హులైన వారి చెంతకు పథకాలను ఈ రథం ద్వారా తీసుకెళ్తామని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ కార్యక్రమం వాయిదా పడిందని, ఈ నేపథ్యంలో శనివారం ప్రారంభించిన యాత్రను జనవరి 25 వరకు కొనసాగిస్తామని, రథాన్ని ప్రతి ఊరుకు తీసుకువెళ్లి కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తామని వివరించారు. అలాగే అర్హులకు పథకాల మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు.

మోదీ పాలనలో గత 9 ఏళ్లలో దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులు, మహిళా సంఘాలకు రుణాలు, పేదల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య చికిత్స, రైతులకు పెట్టుబడి సాయం, గూడు లేని పేదలకు పక్కా ఇళ్లు, ఉచిత రేషన్, గ్యాస్‌ కనెక్షన్లవంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రతి గ్రామానికి డ్రోన్‌ మంజూరు..
రైతులు పంటలకు మందులు పిచికారీ చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక మహిళా సంఘానికి డ్రోన్‌ సౌకర్యం సమకూర్చుతున్నట్లు మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టుగా తొలుత 15 వేల డ్రోన్‌లను ఇవ్వనున్నట్లు చెప్పారు. 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)