Breaking News

‘విద్యానిధి’ కఠినతరం!

Published on Tue, 11/11/2025 - 06:04

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో అత్యంత ఎక్కువ మొత్తంలో రాయితీ అందిస్తున్న పథకం ఓవర్సీస్‌ విద్యానిధి పథకం. దీనికింద ఎంపికైన లబ్ధిదారుకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి అర్హతల ఆధారంగా లబ్ధిదారులను రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక చేస్తుంది. 

తాజాగా ఈ పథకం కింద కోటాను ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసింది. మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా గతేడాది వరకు 1100 మంది విద్యార్థులకు సాయం అందిస్తుండగా... తాజాగా కోటా పెంపుతో లబ్ధిదారుల సంఖ్య 1900కు పెరిగింది. దీంతో దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అర్హుల ఎంపికను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు సంక్షేమ శాఖలు కసరత్తు చేస్తున్నాయి.  

ప్రతి కేటగిరీలో మెరిట్‌ కీలకం 
విదేశీ విద్యానిధి పథకం కింద అర్హత సాధించేందుకు బ్యాచ్‌లర్‌ డిగ్రీలో మెరుగైన మార్కులు, ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌ పరీక్షలో మెరిట్‌ సాధిస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు పరిగణించి అర్హత కల్పించేవి. బీసీ సంక్షేమ శాఖలో మాత్రం పోటీ తీవ్రంగా ఉండటంతో మరింత లోతుగా మెరిట్‌ను పరిశీలించి అర్హతలు ఖరారు చేసేవారు. కానీ ఇప్పుడు అన్ని సంక్షేమ శాఖలకు పోటీ తీవ్రం కానుంది. 

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల్లో 1:3 చొప్పున దరఖాస్తులు ఉంటే... బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 1:20 చొప్పున దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం మూడు సంక్షేమ శాఖల పరిధిలో కోటాను భారీగా పెంచింది. తాజాగా సంక్షేమ శాఖలు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా... క్షేత్రస్థాయి నుంచి స్పందన భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల వడపోతకు సంక్షేమ శాఖలు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాయి. 

అభ్యర్థులను అన్ని కేటగిరీల్లోనూ మెరిట్‌ ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. ముందుగా అభ్యర్థి సాధించిన డిగ్రీ మార్కులను విశ్లేషిస్తారు. ఆ తర్వాత జీఆర్‌ఈ/జీమ్యాట్‌లో మార్కులను మెరిట్‌ ఆధారంగా పరిశీలిస్తారు. అనంతరం ఐఈఎల్‌టీఎస్‌/టోఫెల్‌ మార్కుల్లోనూ మెరిట్‌ ఆధారంగా వడపోస్తారు. ఇందుకు సంబంధించి నిబంధనలను సంక్షేమ శాఖలు త్వరలో సవరించనున్నట్లు తెలుస్తోంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)