Breaking News

భర్త వివాహేతర సంబంధం.. కత్తితో వివాహిత హల్చల్

Published on Thu, 01/08/2026 - 08:21

రామన్నపేట: భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగా  తనకు, తన పిల్లలకు ఆస్తిలో వాటా ఇవ్వాలని భర్త దుకాణం ఎదుట భార్య కత్తితో హల్చల్‌ చేసింది. ఈ ఘటన వరంగల్‌ నగరంలో బుధవారం చోటుచేసుకుంది. నగరానికి చెందిన జ్యోత్స్నకు మెరుగు శ్రీకాంత్‌ అనే వ్యక్తితో 20 ఏళ్లక్రితం వివాహమైంది. భర్తకు వరంగల్‌ చౌరస్తాలో జ్యువెలరీ దుకాణం ఉంది. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 8 ఏళ్ల కిత్రం విడిపోయారు. విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. 

ఈ క్రమంలో మంగళవారం కోర్టు వాయిదా ఉండగా జ్యోత్స్న హాజరు కాలేదు. బుధవారం తన భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్‌ చేసింది. తన భర్త వేరే మహిళతో సహజీవనం సాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇంతెజార్‌గంజ్‌ పోలీసులు అక్కడికి చేరుకుని సదరు వివాహితకు నచ్చజెప్పి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించగా, ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని వారు తెలపడంతో వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఆ మహిళను కుటుంబ సభ్యులతో పంపించారు. 

 

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)