Breaking News

నకిలీ గడ్డి మందుల ముఠా అరెస్ట్‌

Published on Tue, 08/08/2023 - 15:02

సాక్షి, వరంగల్‌: నకిలి విత్తనాలతో పాటు గడువు తీరిన పురుగుల మందులను విక్రస్తున్న ముఠా గుట్టును వరంగల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. నకిలీ విత్తనాలు, మందులతో పాటు నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మూడు ముఠాలకు చెందిన 13మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. అలాగే ఇద్దరు ఫర్టిలైజర్ షాప్ యాజమానులపై కూడా కేసు నమోదయ్యింది. ఈ దాడిలో నిందితుల నుంచి 75 లక్షల విలువైన నకిలీ, గుడువు తీరిన పురుగుల మందు, నిషేధిత గడ్డి మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మందుల తయారీకి అవసరమైన రసాయనాలు, ప్రింటింగ్ సామగ్రి, ఖాళీ బాటిల్స్, ఓ కారును పోలీసులు సీజ్‌ చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. పట్టుబడ్డ మందుల్లో 24 లక్షల రూపాయల విలువైన గడువు తీరిన పురుగు మందులు, 30 లక్షల రూపాయల విలువ గల నకిలీ పురుగు మందులు, 3 లక్షల 53వేల రూపాయల విలువగల ప్రభుత్వ నిషేదిత గడ్డి మందు ఉన్నట్లు సిపి రంగనాథ్‌ తెలిపారు. గడువు తీరిన మందులు సైతం విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో నిఘా పెట్టగా ముఠాల గుట్టురట్టయిందని, కల్తీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సీరియస్ యాక్షన్ చేపట్టామన్నారు. కల్తీలతో మోసానికి పాల్పడే వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తామని పేర్కొన్నారు. మందులు కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలని సిపి రంగనాథ్‌ రైతులకు సూచించారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)