Breaking News

బామ్మ బావిలో ప‌డింద‌ని.. నీళ్లన్నీ తోడేశారు.. తీరా చూస్తే!

Published on Mon, 09/01/2025 - 13:29

దుగ్గొండి: ఓ వృద్ధురాలు బావిలో పడిందని భావించి.. అధికారులు భారీ మోటార్ల సాయంతో నీటిని తోడేశారు. చివరికి వృద్ధురాలు పత్తి చేనులో కనిపించింది. ఈ సంఘటన ఆదివారం వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలో జరిగింది. దుగ్గొండికి చెందిన మాడిశెట్టి రాజ్యలక్ష్మి అనే 75 ఏళ్ల వృద్ధురాలు ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్లింది. 

ఉదయం ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల అంతటా వెదికారు. ఓ వ్యవసాయ బావి (agricultural well) వద్ద వృద్ధురాలి చీర, బావిలోకి జారిన గుర్తులు కనిపించాయి. దీంతో ఆమె బావిలోనే పడిందని భావించిన కుటుంబ సభ్యులు అధికారుల సాయంతో ఐదు విద్యుత్‌ మోటార్లు, ఫైరింజన్‌తో నీటినంతా తోడేశారు. సాయంత్రం వరకు వృద్ధురాలికోసం గాలిస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో గాలింపు చర్యలను చూడడానికి అక్కడికి వెళ్లిన కొందరు యువకులు.. మూత్ర విసర్జన కోసం సమీపంలోని పత్తి చేను లోపలికి వెళ్లారు. అక్కడ పత్తి మొక్కల మధ్య రాజ్యలక్ష్మి నిద్రపోతూ కనిపించింది. ఇది గమనించిన యువకులు వృద్ధురాలిని నిద్రలేపి చేనులో నుంచి బయటికి తీసుకొచ్చారు. రాజ్యలక్ష్మికి మతిమరుపు సమస్య ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక, గ్రామ పంచాయతీ సిబ్బంది దాదాపు 100 మంది వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రమించారు.  

చ‌ద‌వండి: నేరుగా రైతులతో మాట్లాడిన గ‌ణ‌ప‌య్య‌!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)