Breaking News

ఓటమి పాలైన అభ్యర్థిని తిట్లు భరించలేక...

Published on Fri, 12/26/2025 - 04:34

రామారెడ్డి(ఎల్లారెడ్డి): పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డుకు పోటీ చేసిన మహిళ ఓటమి పాలైంది. అప్పటి నుంచి బూతు పురాణం అందుకుంది. వార్డు ప్రజలను నోటి కొచ్చినట్టు తిడుతోంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ వార్డు ఓటర్లు ఆమె పంపిణీ చేసిన బీర్లు, చీరలు, కూల్‌డ్రింక్స్‌ను గ్రామ పంచాయతీ ముందు పెట్టి నిరసన తెలిపారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో చోటుచేసుకుంది. 

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబవ్వ ఉప్ప లవాయి పంచాయతీలోని 2వ వార్డుకు పోటీ చేసింది. ఓట ర్లను ఆకట్టుకునేందుకు బీర్లు, మహిళలకు చీరలు, కూల్‌డ్రింక్స్‌ పంపిణీ చేసింది. ఓటమి పాలైన రోజు నుంచి వార్డు ఓటర్లను ఇష్టానుసారంగా పరుష పదజాలంతో దూషిస్తోందని వార్డు ప్రజలు వాపోయారు. 

గురువారం కూడా బాబవ్వ తన నోటికి పని చెప్పడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె పంపిణీ చేసిన చీరలు, బీర్లు, కూల్‌డ్రింక్స్‌ను పంచాయతీ కార్యాలయం ఎదుట పడేసి నిరసన తెలిపారు. ఇదే మండలంలోని మరో రెండు మూడు గ్రామాలలో ఓటమిపాలైన వార్డు సభ్యులు తాము పంపిణీ చేసిన ఆండాలు (ఫంక్షన్లకు ఉపయోగించే వంట సామగ్రి ), బగోనేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో చేసేదిలేక తిరిగి ఇచ్చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)