Breaking News

వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయ్‌: అవినాష్‌రెడ్డి న్యాయవాది

Published on Mon, 04/17/2023 - 16:50

సాక్షి, హైదరాబాద్‌: వివేకా కేసులో వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. కేవలం దస్తరిగి ఇచ్చిన కన్ఫెషన్‌ తప్ప.. సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, పైగా దస్తగిరిని కూడా బెదిరించి ఆ స్టేట్‌మెంట్‌ తీసుకుందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. ఆపై పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు.   

అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది వాదనలు.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేశారు. భాస్కర్‌రెడ్డి పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే అరెస్ట్‌ చేశారు. ఆయన్ని అరెస్ట్‌ చేయడానికి దస్తగిరి కన్ఫెషన్‌ తప్ప సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరిని బెదిరించి.. చిత్రహింసలకు గురిచేసినట్లు ఎర్ర గంగిరెడ్డి చెప్పాడు. దస్తగిరి కూడా సీబీఐకి భయపడి భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 

వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయి. ఒకటి కుటుంబం, రెండోది వ్యాపార సంబంధాలు, మూడోది వివాహేతర సంబంధాలు, నాలుగోది పొలిటికల్‌ గెయిన్‌. వీటిపై సీబీఐ ఫోకస్‌ పెట్టలేదని అవినాష్‌ రెడ్డి తరపున న్యాయవాది వాదించారు. అలాగే.. వైఎస్‌ అవినాష్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని, రాజకీయ కోణంలో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను ఇరికించే కుట్రలో భాగమే ఇదంతా అని వాదించారు.   

ఈ తరుణంలో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది తెలంగాణ హైకోర్టు. అంతేకాదు.. వివేకా కేసులో అవినాష్‌రెడ్డి ఇవాళ్టి విచారణను రేపటికి సీబీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. రేపు సాయంత్రం నాలుగు గంటల తర్వాతే అవినాష్‌రెడ్డిని విచారణకు పిలవాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: వివేకాపై అందుకే సునీత కక్షగట్టింది

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)