Breaking News

‘వివేకా హత్యలో దస్తగిరి పాల్గొన్నాడు’

Published on Thu, 04/13/2023 - 16:48

సాక్షి,హైదరాబాద్‌: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. గురువారం వైఎస్‌ భాస్కరరెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించగా, ఆపై సీబీఐ కూడా తమ వాదనలు వినిపించింది. వివేకా కేసులో దర్యాప్తును సీబీఐ పక్కదారి పట్టించిందని..  భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని భాస్కర్‌రెడ్డి తరపున లాయర్‌ నిరంజన్‌రెడ్డి వాదించారు. 

కేసుతో భాస్కర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు.  అయినా భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను ఇరికించే కుట్ర జరుగుతోంది. సీబీఐ ఉద్దేశపూర్వకంగానే.. మా క్లయింట్లను లాగే ప్రయత్నం చేస్తున్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని వ్యతిరేకిస్తున్నాం. వివేకా హత్యలో దస్తగిరి పాల్గొన్నాడు. అలాంటిది  నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చేసి.. దర్యాప్తును సీబీఐ పక్కదారి పట్టించింది.  

ఒక నిందితుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా మా క్లయింట్లను ఈ కేసులోకి ఎలా లాగుతారు. గూగుల్‌ టేక్‌అవుట్‌ ఫొటోలను ఎలా ఆధారంగా చూపిస్తారు?. ఇది ముమ్మాటికీ మా క్లయింట్స్‌ను ఇరికించే ప్రయత్నమే అంటూ లాయర్‌ నిరంజన్‌రెడ్డి వాదించారు.  

ఇక సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..  మాజీ మంత్రి వివేకానందరెడ్డిది హత్యేనేని, వివేకాను ఎవరు హత్య చేశారన్నది తేలాల్సి ఉందని,  సుప్రీం కోర్టు ఈ కేసును దగ్గరగా పర్యవేక్షిస్తోందని వాదించింది. ఈ తరుణంలో ఈ కేసులో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)