Breaking News

GHMC commissioner: వర్క్‌ ఫ్రమ్‌ ఝార్ఖండ్‌

Published on Sat, 11/09/2024 - 07:55

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కె.ఇలంబర్తి దాదాపు గత పది రోజులుగా నగరంలో లేరు. కేంద్ర ఎన్నికల సంఘం  త్వరలో ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్‌ రాష్ట్రంలో ఆయనను ఎన్నికల పరిశీలకుడిగా నియమించడంతో అక్కడే ఉన్నారు. అయినా.. ఆయన  అక్కడి నుంచే ప్రతిరోజూ జీహెచ్‌ఎంసీ కార్యక్రమాలు చక్కపెడుతున్నారు.  ప్రతిరోజూ అడిషనల్, జోనల్, డిప్యూటీ  కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్‌లు, సందర్భాన్ని బట్టి వెబినార్‌లు నిర్వహిస్తున్నారు.  

కుటుంబ సర్వేపైనా ఆరా.. 
సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి కూడా ఇలంబర్తి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు, కంటోన్మెంట్‌ అధికారులతోనూ చర్చిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు తగిన సూచనలు ఇస్తున్నారు. ఇంటింటికి స్టిక్కరింగ్‌ కార్యక్రమం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటూ, పని త్వరితగతిన జరిగేందుకు అధికారులను పురమాయిస్తున్నారు. 

ఇన్‌చార్జ్‌ ఆఫీసర్లు 
ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌లోని 30 సర్కిళ్లు, కంటోన్మెంట్‌ బోర్డు ప్రాంతానికి వెరసి.. 12 మంది ఉన్నతాధికారులను ప్రత్యేకంగా ఇన్‌చార్జులుగా నియమించారు. అడిషనల్‌ కమిషనర్లు ఎస్‌.సరోజ, ఎన్‌. యాదగిరిరావు, ఎస్‌.పంకజ, ఎన్‌. సామ్రాట్‌ అశోక్, గీతారాధిక, కె.సత్యనారాయణ, చంద్రకాంత్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సీఎన్‌.రఘుప్రసాద్, నళినీ పద్మావతి, ఎస్టేట్‌ ఆఫీసర్‌ వై.శ్రీనివాస్‌రెడ్డి,  ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ శరత్‌చంద్రలకు ఆయా సర్కిళ్ల బాధ్యతలు అప్పగించారు.  

ఫైళ్ల క్లియరెన్స్‌ సైతం.. 
జీహెచ్‌ఎంసీకి సంబంధించి రోజూ పత్రికల్లో వస్తున్న వార్తలపైనా ఇలంబర్తి స్పందిస్తున్నారు. ముఖ్యంగా, ప్రతికూల వార్తలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్‌ పనుల గురించి తెలుసుకుంటున్నారు. బిల్లుల చెల్లింపులపైనా ఆదేశిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ వాహనాల పెట్రోల్, డీజిల్‌ల చెల్లింపులకు సంబంధించిన ఫైళ్ల పరిశీలన సందర్భంగా ప్రైవేటు బంకుల నుంచి కొనాల్సిన అవసరమేముందంటూ ప్రశ్నించినట్లు సమాచారం.  

డ్యూయల్‌ రోల్‌.. 
సాధారణంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సెలవుపై వెళ్లినా, ఇతరత్రా సందర్భాల్లోనూ విధుల్లో లేకుంటే మరో ఉన్నతాధికారిని జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. ఇలంబర్తి అదనపు బాధ్యతలతోనే కమిషనర్‌గా ఉన్నందున, వేరెవరినీ ఇన్‌చార్జిగా నియమించలేదని సమాచారం.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)