Breaking News

ఇద్దరు కొడుకులకు ఉరి వేసి..

Published on Sun, 11/01/2026 - 08:25

వికారాబాద్: ఆ తల్లి మనసు పాషాణమైంది.. తాను లేకుంటే కన్న కొడుకులు నిరాదరణకు గురవుతారన్న వేదనతో ఉరి వేసి ఇద్దరినీ కడతేర్చింది. తర్వాత తానూ ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ హృదయ విదారక సంఘటన శనివారం మధ్యాహ్నం వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలం చింతకుంటలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన పట్లోళ్ల భూపతిరెడ్డి తొమ్మిదేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మడికట్టు గ్రామానికి చెందిన వాసవి (28)ని వివాహం చేసుకున్నాడు. 

వీరికి సహర్షరెడ్డి (8), వేదార్షరెడ్డి (4) కుమారులు. భార్యాభర్తలు నాలుగేళ్లుగా వికారాబాద్‌లో ఉంటున్నారు. భర్త తాండూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా, భార్య వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల లో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం భార్యాభర్తలు పిల్లలతో కలిసి చింతకుంట గ్రామానికి వచ్చారు. భార్య, పిల్లలను ఇంట్లో వదిలిపెట్టిన భూపతిరెడ్డి తిరిగి వికారాబాద్‌ వెళ్లిపోయాడు. ఇంట్లో ఉన్న అత్తామామలు పొలం పనులకు వెళ్లారు. 

పిల్లలతో ఒంటరిగా ఉన్న వాసవి తొలుత కుమారు లిద్దరినీ ఉరివేసి చంపింది. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘట న స్థలానికి చేరుకున్న ధారూరు సీఐ రఘురామ్, ఎస్‌ఐ సురేశ్‌ మృతదేహాలను వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)