Breaking News

ప్రియురాలి కోసం భార్యను చంపి..

Published on Sun, 01/18/2026 - 08:02

కృష్ణా జిల్లా: తల్లిని తమ తండ్రి చంపటం జీర్ణించుకోలేక పోతున్నామని, తమ తండ్రికి కచ్చితంగా శిక్ష పడాలని మృతురాలు రేణుకాదేవి కుమార్తె, కుమారుడు ముక్కామల తేజశ్రీ, ముక్కామల నాగేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పోరంకిలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమ తండ్రి ముక్కామల ప్రసాద్‌ చౌదరి ఆకునూరు ఝాన్సీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తమ తల్లి అడ్డుగా ఉందని పథకం ప్రకారం హత్య చేశారని తెలిపారు. 

తమ పట్ల తండ్రి కపటప్రేమ చూపాడని, తల్లి పేరున ఉన్న ఇంటిని నమ్మకంగా తన పేరున రాయించుకున్నాడని అన్నారు. తమ తండ్రి ఇంత దారుణానికి ఒడికడతాడని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. సెల్‌ఫోన్‌ డేటా ఆధారంగానే తల్లి హత్య ఉదంతం వెలుగు చూసిందని అన్నారు. హత్య వెనుక పలువురు వ్యక్తుల ప్రమేయం ఉందని అనుమానాలు ఉన్నాయని దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని కోరారు.    

నన్ను కూడా చంపాలని చూశారు...  
తన తండ్రి ప్రసాద్‌చౌదరి, ఆయనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఝాన్సీ తనను కూడా హత్య చేయాలని చూశారని మృతురాలి కుమారుడు నాగేష్‌ ఆరోపించారు. తనకు ఇష్టం లేకపోయినా తనను యూకేకు బలవంతంగా పంపారని, తనను యూకేలోనే చంపాలని పథకం వేశారని అన్నారు. తాను యూకేకు వెళ్లిన 25 రోజుల్లోనే తల్లిని హత్య చేశారని చెప్పారు. దీంతో తాను    ఇండియాకు వచ్చానన్నారు. ఇంత దారుణానికి పాల్పడిన తండ్రి ప్రసాద్‌చౌదరి, ఝాన్సీలకు శిక్షపడాలని అన్నారు.   

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)