Breaking News

వైద్యంలో రాష్ట్రాన్ని నంబర్‌వన్‌ చేయాలి 

Published on Fri, 05/12/2023 - 03:57

సాక్షి, హైదరాబాద్‌: వ్యక్తిగత పర్యటన కోసం అమెరికా వెళ్లిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అక్కడి నుంచి కూడా విధులు నిర్వహిస్తుండటం విశేషం. గురువారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బోధనాస్పత్రులపై సమీక్ష నిర్వహించారు. 65 మందికి ప్రొఫెసర్లు, 210 మందికి అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇచ్చామని మంత్రి తెలిపారు. అలాగే 1,061 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసినట్లు వివరించారు.

వీరికి నియామక ఉత్తర్వులను ఈనెల 22న శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో అందజేస్తామన్నారు. వీరందరి సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని, రాష్ట్రాన్ని ఈ రంగంలో మొదటి స్థానానికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు.

మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ విద్యార్థులకు టీచింగ్‌ ఫ్యాకల్టీ ఆదర్శంగా ఉండాలని ఆయన సూచించారు. ర్యాగింగ్‌ లాంటివి లేకుండా చూడాలన్నారు. కాగా, విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకున్న 900 మంది తెలంగాణ విద్యార్థులకు ఒక ఏడాది ఇంటర్న్‌ షిప్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారా పోస్టింగులు ఇచ్చామని ఆయన తెలిపారు.  

డ్యూటీ డాక్టర్లు కచ్చితంగా ఉండాలి.. 
24 గంటలూ.. మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో డ్యూటీ డాక్టర్లు ఉండాలని హరీశ్‌రావు సూచించారు. ఎమర్జెన్సీ విభాగంలో డ్యూటీ డాక్టర్లు కచ్చితంగా ఉండాలని కోరారు. ముహూర్తాలు చూసి ప్రసవాలు చేయకూడదని, గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని బట్టి సాధారణ లేదా సీ సెక్షన్‌ డెలివరీ చేయాలని స్పష్టం చేశారు.

ఐదు లక్షల రూపాయలకు పైబడి విలువ చేసే వైద్య పరికరాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. అలాగే అన్ని వైద్య పరికరాలు పని చేసేలా చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లదేనన్నారు. ఈ సమీక్షలో వైద్యాధికారులు రిజ్వీ, రమేశ్‌ రెడ్డి, శ్వేతా మహంతి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)