Breaking News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తీర్పు రిజర్వు

Published on Fri, 02/28/2025 - 04:56

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నాయకుడు చక్రధర్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు వాదనలు వినిపించగా.. విచారణ నిలుపుదల ఆదేశాలను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఇరుపక్షాల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు హాజరై వాదనలు వినిపించారు. వాదనలు పూర్తికావడంతో న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ తీర్పు రిజర్వు చేశారు. 

రాజకీయ కక్షతో చక్రధర్‌గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదు చేసిన ‘ట్యాపింగ్‌’ కేసును కొట్టివేయాలంటూ హరీశ్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాగే ఇదే కేసులో మరో నిందితుడైన రాధాకిషన్‌రావు కూడా మరో పిటిషన్‌ దాఖలు చేశారు. హరీశ్‌ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ గురువారం విచారణ చేపట్టారు. పోలీసుల తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా గత విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనకు, హరీశ్‌ తరఫు న్యాయవాది దామ శేషాద్రినాయుడి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. 

న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ఈ అంశాన్ని వదిలేయాలని, మెరిట్‌పై వాదనలు కొనసాగించాలని సూచించారు. ఫిర్యాదుపై దర్యాప్తు విచారణ చేపట్టే అధికారం పోలీసులకు ఉంటుందని లూథ్రా చెప్పారు. దర్యాప్తు పారదర్శకంగా సాగడం లేదని, ఇతర నిందితులను హింసించి హరీశ్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం చెప్పాలని పోలీసులు వేధిస్తున్నారని శేషాద్రి నాయుడు వాదించారు. 

రాజకీయ కక్షలో భాగంగా హరీశ్‌ను అరెస్టు చేయాలని సర్కార్‌ భావిస్తోందని.. అందుకే, ఫిర్యాదుదారు (చక్రధర్‌గౌడ్‌)కు వత్తాసు పలుకుతోందన్నారు. అలాగే రాధాకిషన్‌రావు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌లో వాదనలను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)