Breaking News

మంత్రి కేటీఆర్‌ను కలిసిన చెన్నమనేని..

Published on Fri, 09/08/2023 - 19:45

సాక్షి, హైదరాబాద్‌: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు.  శుక్రవారం సాయంత్రం సచివాలంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. వేములవాడ నియోజకవర్గంలోని  అభివృద్ది పనులు, పెండింగ్ పనులు, అనుమతులపై కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా చెన్నమనేనికి మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

కాగా వేములవాడ ఎమ్మెల్యే టికెట్‌ను చల్మెడ లక్ష్మీనర్సింహరావుకు కేటాయించడంతో చెన్నమనేని అలకబూనిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నమనేని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రధాన సలహాదారుగా నియమించారు. అంతేగాక ఇటీవలే చెన్నమనేని రమేష్‌  అమెరికా, దుబాయ్ దేశాల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల ఏర్పాటు చేసుకుని  తెలంగాణ వచ్చారు. 

ఈ క్రమంలో నేడు కేటీఆర్‌తో భేటీ అయి.. వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ పనుల అనుమతులు, దేవాలయ అభివృద్ది, కలికోట సూరమ్మ చెరువు, మిగిలి వున్న ముంపు గ్రామాల సమస్యలు, ప్రధాన మైన రోడ్లు, బ్రిడ్జీల అనుమతులు మొదలగు వాటిపై చర్చించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహా దారులుగా నియమితులైన రమేష్‌కు కేటీఆర్‌కు  శుభాకాంక్షలు తెలిపారు.

తనపై నమ్మకం ఉంచి గురుతరమైన బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇందుకు సహకరించిన జిల్లా స్థానిక మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెన్నమనేని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పజెప్పిన ఈ బాధ్యతకు పూర్తిస్థాయి న్యాయం  చేస్తానని చెప్పారు. 

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్