Breaking News

తేజస్‌ యుద్ధ విమానంలో హైదరాబాద్‌ ‘మార్క్‌’1ఏ

Published on Thu, 05/29/2025 - 00:39

శంషాబాద్‌: భారతదేశం అభివృద్ధి చేసిన తేజస్‌ యుద్ధ విమానంలో ప్రధాన భాగాన్ని (సెంట్రల్‌ ఫ్యూస్‌లేజ్‌) పూర్తి దేశీయ పరిజ్ఞానంతో వెమ్‌ టెక్నాలజీ సంస్థ తయారు చేసింది. దీనికి ‘మార్క్‌1ఏ’గా నామకరణం చేసింది. రక్షణ రంగంలోని వివిధ పరికరాల తయారీలో పేరుగాంచిన ఈ సంస్థ హిందుస్తాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)తో తొలుత అభివృద్ధి భాగస్వామిగా సెంట్రల్‌ ఫ్యూస్‌లేజ్‌ (సీఎఫ్‌)ను తయారుచేసి సక్సెస్‌ కావడంతో ఉత్పత్తి భాగస్వామిగా మారింది. 3 నెలల్లో తొలి సీఎఫ్‌ విజయవంతంగా పూర్తి చేసి హెచ్‌ఏఎల్‌కు అందించేందుకు సిద్ధమైంది. యుద్ధవిమానంలోని సీఎఫ్‌ను తయారుచేసిన దేశీయ మొదటి ప్రైవేటు సంస్థగా ఇది నిలిచింది.

ఏమిటి సీఎఫ్‌? 
డెల్టావింగ్‌ కలిగి ఒకే ఇంజిన్‌తో పనిచేసే తేజస్‌ మల్టిరోల్‌ లైట్‌ కాంబాట్‌ యుద్ధవిమానాన్ని హెచ్‌ఏఎల్‌ రూపొందించిన సంగతి తెలిసిందే. విమానంలో ఫ్రంట్‌ ఫ్యూస్‌లేజ్‌ అంటే పైలట్‌ కూర్చునే భాగం, రియర్‌ ఫ్యూస్‌లేజ్‌ అంటే విమానంలోని వెనుక భాగం, కింద ఉండే ల్యాండింగ్‌ విభాగాలను అనుసంధానించుకునే ప్రధాన భాగాన్నే (విమానం మధ్యలో ఉండే) సెంట్రల్‌ ఫ్యూస్‌లేజ్‌ అంటారు. ఇది మానవ శరీరంలోని మధ్యభాగంలాంటిదన్నమాట. మిగతా అన్ని భాగాలను దీనితో అనుసంధానిస్తారు. ఇందులోనే ప్రధానమైన ఇంజిన్‌ కూడా ఉంటుంది. 

ఏమిటి సీఎఫ్‌? 
డెల్టావింగ్‌ కలిగి ఒకే ఇంజిన్‌తో పనిచేసే తేజస్‌ మల్టిరోల్‌ లైట్‌ కాంబాట్‌ యుద్ధవిమానాన్ని హెచ్‌ఏఎల్‌ రూపొందించిన సంగతి తెలిసిందే. విమానంలో ఫ్రంట్‌ ఫ్యూస్‌లేజ్‌ అంటే పైలట్‌ కూర్చునే భాగం, రియర్‌ ఫ్యూస్‌లేజ్‌ అంటే విమానంలోని వెనుక భాగం, కింద ఉండే ల్యాండింగ్‌ విభాగాలను అనుసంధానించుకునే ప్రధాన భాగాన్నే (విమానం మధ్యలో ఉండే) సెంట్రల్‌ ఫ్యూస్‌లేజ్‌ అంటారు. ఇది మానవ శరీరంలోని మధ్యభాగంలాంటిదన్నమాట. మిగతా అన్ని భాగాలను దీనితో అనుసంధానిస్తారు. ఇందులోనే ప్రధానమైన ఇంజిన్‌ కూడా ఉంటుంది. 

నెలకు ఒకటి తయారీ 
హెచ్‌ఏఎల్‌ పర్యవేక్షణలో శిక్షణ పొందిన బృందంతో 3 నెలల్లో తొలి సీఎఫ్‌ తయారు చేశాం. వివిధ దశల్లో హెచ్‌ఏఎల్‌ క్లియరెన్స్‌తో దీనిని పూర్తి చేశాం. ఇకపై నెలకొకటి చొప్పున అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాం. హెచ్‌ఏఎల్‌ పర్యవేక్షణతో వారి క్లియరెన్స్‌తో వీటి తయారీ జరుగుతుంది. ప్రస్తుతం 20 సీఎఫ్‌ల తయారీకి హెచ్‌ఏఎల్‌ అనుమతినిచ్చింది.  – సీహెచ్‌వీ రామారావు, జీఎం, వెమ్‌ టెక్నాలజీ

హైదరాబాద్‌లో... 
హైదరాబాద్‌లోని వెమ్‌ టెక్నాలజీ సంస్థ రూపొందించిన ఈ సీఎఫ్‌ తయారీలో 25 మంది ఇంజనీర్లు, 35 మంది టెక్నీషియన్ల బృందం పాల్గొంది. దీనికోసం మొత్తం 1,595 కాంపోనెంట్స్‌ వాడారు. వివిధ భాగాలను అనుసంధానించేందుకు సంస్థలో జిగ్‌ (పరికరాలను బిగించే ప్రాంతం) ఏర్పాటు చేసుకున్నారు. 

ప్రస్తుతం సంస్థలో రెండు జిగ్‌లున్నాయి. వెమ్‌ టెక్నాలజీ సంస్థ తన తొలి సీఎఫ్‌ మార్క్‌1ఏ ను శుక్రవారం హెచ్‌ఏఎల్‌కు అప్పగించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి సంజీవ్‌కుమార్, హెచ్‌ఏఎల్‌ సీఎండీ డాక్టర్‌ డీకే సునీల్, హెచ్‌ఏఎల్‌ డైరెక్టర్‌ కె.రవి హాజరు కానున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)