Breaking News

‘సజ్జనార్‌ సార్‌.. ఇలాంటి వారిని ఏం చేయలేమా?’

Published on Thu, 12/19/2024 - 10:55

తెలంగాణ ఐపీఎస్‌ ఆఫీసర్‌ వీసీ సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగానే కాదు.. పోలీస్‌ అధికారికానూ సోషల్‌ మీడియాలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తుంటారు. ఆలోచింపజేసే కంటెంట్‌ను పోస్ట్‌ చేస్తూ.. అదే సమయంలో కొన్ని విషయాలపై జనాల్ని అప్రమత్తం చేస్తుంటారు కూడా.  తాజాగా.. ఆయన పోస్ట్‌ చేసిన ఓ వీడియోపై నెటిజన్లు ఆయన కామెంట్‌ సెక్షన్‌లోనే చర్చ జరుపుతున్నారు.

సజ్జనార్‌ ఓ వీడియోను పోస్ట్‌ చేసి ఓ సందేశం ఉంచారు. అందులో.. ఓ యువకుడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ప్రమోషన్‌ చెబుతూ.. అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఆ వీడియోను పోస్ట్‌ చేసిన సజ్జనార్‌.. బెట్టింగ్ కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి అని మెసేజ్‌ ఇచ్చారు. అయితే.. ఆ వీడియోపై పలువురు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. ఇలాంటి వాళ్లను అరెస్ట్‌ చేయలేమా? అని..

ఈ వీడియోలో కుర్రాడు మాత్రమే కాదని.. ఇలాంటి వాళ్లు బోలెడు మంది ఉన్నారని.. అలాంటి వారిని అరెస్ట్‌ చేయలేమా? అని ఓ వ్యక్తి కామెంట్‌ చేశాడు. అలాగే.. ఇలాంటి వారిని స్టార్టింగ్‌ స్టేజ్‌లోనే ఆపేయాలని, గట్టి చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి కామెంట్‌​ చేశాడు. మరో వ్యక్తి.. ముందు ఆ వీడియోలోని వ్యక్తిని అరెస్ట్‌ చేయాలంటూ పోలీసులను ట్యాగ్‌ చేశాడు. అయితే ఆ కామెంట్లకు సజ్జనార్‌ నుంచి ఏదైనా బదులు వస్తే బాగుండు అని ఇంకో వ్యక్తి కామెంట్‌ చేశాడు. 

తెలంగాణ, ఆ మాటకొస్తే.. దేశంలో ఆన్‌లైన్‌ జూదాలకు బలైపోతున్నవాళ్లు ఎందరో. అలాంటి ముఠాలను చట్టాలు సైతం కట్టడి చేయలేకపోతున్నాయి. మరోవైపు వాటిని ప్రమోట్‌ చేస్తూ పబ్బం గడుపుకునేవాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు.  ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరిట సోషల్‌ మీడియా ఫిగర్లు, యూట్యూబర్లు, కొందరు సెలబ్రిటీలు కూడా వీటిని బహిరంగంగానే ప్రమోట్‌ చేస్తున్నారు. అందుకే బెట్టింగ్‌ యాప్స్‌ను బ్యాన్‌ చేయాలని, వాటని ప్రమోట్‌ చేసేవాళ్లపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు బలంగా కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి: పస్రా పట్టింపు లేదా? నగరంలో కొత్త సంస్కృతి!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)