Breaking News

కట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య

Published on Thu, 11/06/2025 - 11:43

సిద్దిపేట జిల్లా: అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు భరించలేక పెళ్లయిన మూడు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం గజ్వేల్‌లో చోటు చేసుకుంది. గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ (ఎర్రవల్లి)కి చెందిన వనం సుగుణ–నర్సింలు దంపతుల పెద్ద కూతురు వసంతకు గజ్వేల్‌కు చెందిన సమీప బంధువుతో ఆగస్టు 10న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 18 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు, ఇతర సామగ్రి ఇచ్చారు. 

వసంత ఉన్నత చదువులకు ఇరువర్గాలు అంగీకరించాయి. అయితే పెళ్లయిన నెల రోజుల తర్వాత నుంచి అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతో పాటు వివాహేతర సంబంధం అంటగట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వసంత.. ఈనెల 1న పురుగుల మందు తాగింది. కడుపులో నొప్పి వస్తోందంటూ తన తల్లి సుగుణకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించింది. 

విషయం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు వసంతను మెరుగైన చికిత్స కోసం గజ్వేల్‌ ప్రభుత్వా స్పత్రికి, అక్కడి నుంచి పలు ప్రైవేటు ఆస్పత్రు ల్లో చికిత్స చేయించినప్పటికీ తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి వసంత మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వసంత మృతికి కారణమైన భర్త రోహిత్, అత్త దుర్గమ్మ, మామ గంగయ్యలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

 

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు