Breaking News

ఇంటర్‌సిటీల మధ్య వందే మెట్రోలు!

Published on Mon, 04/29/2024 - 04:18

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ మార్గాల్లోనే!
హైదరాబాద్‌ నుంచి నల్లగొండ మీదుగా గుంటూరు, సికింద్రాబాద్‌ నుంచి పెద్దపల్లి మీదుగా కరీంనగర్, సికింద్రాబాద్‌–కర్నూలు, కాచిగూడ–కర్నూలు, సికింద్రాబాద్‌–నాందేడ్, సికింద్రాబాద్‌–సిర్పూర్‌ కాగజ్‌నగర్, సికింద్రాబాద్‌ నుంచి వికారాబాద్‌ మీదుగా రాయచూర్‌ తదితర ప్రాంతాలకు ఈ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

మొదట ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉన్న సికింద్రాబాద్‌–గుంటూరు, సికింద్రాబాద్‌–విజయవాడ వంటి రూట్‌లలో వందే మెట్రోలను ప్రవేశపెట్టొచ్చు. అనంతరం దశలవారీగా ఇతర మార్గాలకు విస్తరించే అవకాశం ఉంది. 

ముఖ్యమైన  స్టేషన్లలోనే హాల్టింగ్‌.. 
వందే మెట్రో రైళ్లు ప్రస్తుతం హైదరాబాద్‌లో నడుస్తున్న మెట్రో రైళ్ల తరహాలోనే ఉంటాయి. మొదట 12 కోచ్‌లతో ప్రారంభించి డిమాండ్‌కు అనుగుణంగా ఆ తరువాత 16 కోచ్‌ల వరకు పెంచనున్నారు. మెట్రో రైళ్ల తరహాలోనే పూర్తిగా ఏసీ సదుపాయం, ఆటోమేటిక్‌గా తలుపులు తెరుచుకొని మూసుకొనే ఏర్పాటు ఉంటుంది. 

ప్రారంభ స్టేషన్‌ నుంచి గమ్యస్థానం వరకు ముఖ్యమైన స్టేషన్లలోనే ఈ రైళ్లకు హాల్టింగ్‌ సదుపాయం ఉండనుంది. ప్రస్తుతం పుష్‌పుల్‌ రైళ్లకు ఉన్నట్లుగానే ముందు, వెనుక రెండు ఇంజన్లు ఉంటాయి. దీంతో ఈ రైళ్లను ప్రత్యేకంగా పిట్‌ లైన్లకు తరలించాల్సిన అవసరంలేదు. తక్కువ సమయంలోనే తిరుగు ప్రయాణ సేవలను అందించే అవకాశం ఉంటుంది.  

రిజర్వేషన్లు ఉండవు... 
ఈ రైళ్లన్నీ సాధారణ రైళ్ల తరహాలోనే సేవలు అందిస్తాయి. దీంతో ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్‌లు కొనుక్కొని బయలుదేరొచ్చు. కూర్చొని ప్రయాణం చేసేందుకు వీలుగా సీట్లు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే వీటిలో కొద్దిగా టికెట్‌ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 

తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవాలనుకొనే వారికి ఈ రైళ్లలో ప్రయాణం లాభదాయకం. వివిధ మార్గాల్లో నడిచే ఇంటర్‌ సిటీ రైళ్ల స్థానంలోనే వందే మెట్రోలు రానున్నాయి. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్‌–విజయవాడ మధ్య నడుస్తున్న ఇంటర్‌సిటీ ట్రైన్‌ యథాతథంగా సేవలను కొనసాగించనుంది. 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు