Breaking News

Valentine's Day: ప్రేమ పేరుతో ఉన్మాదం.. ప్రాణాలు తీస్తున్న అకృత్యాలు

Published on Tue, 02/14/2023 - 14:53

భిన్న సంస్కృతుల సమ్మేళనం మన మహా నగరం. విభిన్న సంప్రదాయాల సంగమం మన హైదరాబాద్‌. ‘భాగ్య’నగరమే ప్రేమ పునాదిగా వెలసిందని కొందరి నమ్మకం. ఆ ప్రేమకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి కొన్ని జంటలు. నగరంలోని కొన్ని ప్రాంతాలు. ప్రేమ అనే రెండు పదాలు మదిలో నాటుకున్న తర్వాత అవి వేద మంత్రాలై పెళ్లికి దారి తీస్తాయి. 

వివాహంతో ఒక్కటవుతాయి.  కష్ట సుఖాలను పంచుకుంటాయి. నీతోటిదే లోకమంటూ కలకలం సాగుతాయి. ఇలాంటి ప్రేమలు కొన్ని అయితే.. మరికొన్ని పగతో రగులుతున్నవీ ఉన్నాయి. క్షణికావేశమో, పక్కా ప్లాన్‌తోనే ప్రేమనే అంతమోందించిన ఘటనలు ఉన్నాయి. మంగళవారం వలెంటైన్స్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనాలు.                             

పెళ్లి చేసుకోమన్నందుకు.. 
ఓల్డ్‌ అల్వాల్‌ సాయిబాబానగర్‌కు చెందిన సరస్వతి, భూదేవి నగర్‌కు చెందిన దీపక్‌ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమె అతడిపై ఒత్తిడి తెస్తోంది. కొన్నాళ్లు దాటవేత ధోరణి ప్రదర్శించిన అతగాడు చివరకు ఆమెను హత్య చేయాలని పథకం వేశాడు. స్నేహితులకు ఫోన్‌ చేసి చెప్పి మరీ ఆమెను చంపేశాడు.  
 
పెళ్లికి నిరాకరించినందుకు.. 
తనను ప్రేమించి పెళ్లి వద్దన్నందుకు యాప్రాల్‌ ప్రాంతానికి చెందిన గిరీష్‌ బాపూజీనగర్‌కు చెందిన చామంతిపై హత్యాయత్నం చేసి, తానూ ఆత్మహత్యకు యతి్నంచాడు. సదరు యువతిని వేధించిన కేసులో అతడు న్యాయ స్థానంలో జరిమానా చెల్లించడం గమనార్హం.  
 
ప్రేమించి మోసం చేసిందని... 
వికారాబాద్‌ జిల్లాకు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ బీఈడీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ సరూర్‌నగర్‌లో నివసిస్తున్నాడు. చదువుకునే రోజుల్లో పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నా ఇటీవల ఆమె ఇతడిని దూరం పెట్టింది. దీంతో తనను మోసం చేసిందని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు.  

ప్రేమ పేరుతో ఉన్మాదం పేట్రేగి ప్రాణాలు తీస్తున్న అకృత్యాలు..లైంగిక వేధింపులతో వెంటపడుతూ చేస్తున్న అఘాయిత్యాలు, ప్రేమ విఫలమైందనే కారణంగా ఆత్మహత్యలు నగరంలో జరుగుతూనే ఉన్నాయి. పదును లేని చట్టాలంటే పట్టని ఉన్మాదులు దాడులతో తెగపడుతున్నారు. అధికారిక గణాంకాల అటుంచితే పరువు, ప్రతిష్టలకు భయపడి జరిగిన అన్యాయంపై బాధితులు ఫిర్యాదు చేయని సందర్భాలు ఎన్నో.

ప్రేమ నేపథ్యంలో జరుగుతున్న ఆత్మహత్యలు సైతం అనేకం ఉంటున్నాయి. అపరిపక్వతే ఈ దురాగతాలకు ప్రధాన కారణంగా మారుతోంది. సమాజంలో మహిళలకు సమున్నత స్థానం, వారి హక్కులను యువకులకు, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగిడుతున్న యువతకు క్షుణ్ణంగా బోధించాలన్న ఉద్దేశంతో రూపొందినదే జాతీయ యువజన విధానం. 

మహిళల పట్ల యువజనులు గౌరవంగా మసలుకొనేలా వారికి అవసరమైన కౌన్సెలింగ్‌ ఇవ్వాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఏళ్ల క్రితం నాటి ఈ విధానం లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. యువజనులను 13–19, 20–35 ఏళ్ల మధ్య వయస్సు గల వారిగా రెండు గ్రూపులుగా యువజన విధానంలో విభజించారు. యవ్వన దశలో కీలకమైన 13–19 ఏళ్ల మధ్య వయస్కులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని అందులో నిర్దేశించారు.

ప్రేమోన్మాదులు, వారి బారినపడుతున్న వారిలో అత్యధికులు ఈ పాతికేళ్లలోపు వారే.  జాతీయ యువజన విధానంలో పొందుపరిచిన విధంగా ఇక్కడి సమాజంలో స్త్రీల స్థానం, వారికి గల హక్కులపై మగపిల్లలకు అవగాహన కల్పించడంలో, మహిళల పట్ల గౌరవంగా మసలుకొనేలా కౌన్సెలింగ్‌ చేయడంలో కానీ ప్రభుత్వాలు శ్రద్ధ చూపట్లేదు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)