Breaking News

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ .. లిస్ట్‌లో మీ పేరు లేదా?

Published on Mon, 01/20/2025 - 20:04

సాక్షి,హైదరాబాద్‌ : కొత్త రేషన్ విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారం చేస్తున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కొత్త రేషన్‌ కార్డుల పంపణీ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణలో 2 కోట్ల 81 లక్షల మందికి...90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో 60వేలు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారు. కొత్త, పాత ప్రక్రియ పూర్తి అయ్యాక 40లక్షల మంది రేషన్ లబ్ధి జరుగుతుందని మా అంచనా.

రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కాగానే ప్రతీ వ్యక్తికి ఆరు కిలోల రేషన్ కూడా సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. సన్న బియ్యం పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.11వేల కోట్ల భారం పడుతుంది. ప్రజా పాలన, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తున్నాం. లిస్ట్‌లో పేర్లు రాని వాళ్ళు ప్రజావాణి, గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకోవాలి.

హరీష్ రావు దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు బీఆర్‌ఎస్‌ మోసం చేసింది. ఇప్పుడు మేము చేస్తుంటే అడ్డుకుంటున్నారు.
కృష్ణ ట్రిబ్యునల్‌ అంశంపై బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హరీష్‌ రావు  చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.

నీళ్ల వారాల్లో కేసీఆర్,హరీష్ రావు లిఖిత పూర్వకంగా సంతకాలు పెట్టారు. పోతిరెడ్డి పాడు, రాయసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కళ్లు మూసుకుని ఉన్నారు. కేసీఆర్‌ పాలనలో కృష్ణా జలాల నీటి వాటాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. 298 టీఎంసీలకు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్‌ ఉన్నాయని’ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)