Breaking News

తెలంగాణ రైతాంగానికి ఊరట

Published on Tue, 08/19/2025 - 21:21

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రైతాంగానికి ఊరట లభించింది. 50 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా కేంద్రం కేటాయించింది. గుజరాత్‌, కర్ణాటక నుంచి యూరియా తరలింపునకు కేంద్రం ఆదేశించింది. వారం రోజుల్లో తెలంగాణకు యూరియా రానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.. మంగళవారం కలిశారు.

కాంగ్రెస్ ఎంపీల ఫోరమ్ చైర్మన్ డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో కేంద్రమంత్రిని కలిసిన ఎంపీలు.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వారంలో 50 వేల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి ఇస్తానని కేంద్రం హామీ ఇచ్చిందని ఎంపీ చామల కిరణ్‌రెడ్డి వెల్లడించారు. 14 వేల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి పంపినట్లు కేంద్రం తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రానికి 14 వేలు మెట్రిక్ టన్నులు యూరియా వస్తుంది.

..వారం రోజుల్లో 48 వేల మెట్రిక్ టన్నులు యూరియా ఇస్తామన్నారు. వారం రోజులుగా యూరియా కోసం ఎంపీలంతా పోరాడుతున్నాం. పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం కూడా ప్రతిపాదించాం. యూరియా కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నేరుగా కేంద్ర మంత్రి నడ్డాను కలిశారు. ఎంపీలం కూడా పలుమార్లు నడ్డాను కలిశాం. మేము పలుమార్లు మంత్రిని కలవడం వల్లనే యూరియా ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది’’ అని చామల కిరణ్‌రెడ్డి తెలిపారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)