Breaking News

మేనిఫెస్టో కోసం ప్రజల వద్దకు

Published on Sun, 03/03/2024 - 04:06

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వికసిత్‌ భారత్‌ సంకల్ప పత్రం పేరిట ప్రజల నుంచి సలహాలు, సూచనల స్వీకరణకు బీజేపీ  జాతీయ నాయకత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాలు తెలుసు కునేలా ’వికసి త్‌ భారత్‌ మోదీ కీ గ్యారంటీ’ పేరు తో చేపట్టిన కార్యక్రమాన్ని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రారంభించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఇతర నాయకు లతో కలిసి ‘మరో సారి మన మోదీ సర్కార్‌ ’ పోస్టర్‌ను ఆయన  విడుదల చేశారు. రిమోట్‌ నొక్కి డిజిటల్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

అభిప్రాయాలు నేరుగా ప్రధానికి..
వివిధ రూపాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని నేరుగా ప్రధాని మోదీకి తెలియజేసేలా ఏర్పాట్లు చేసినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. వివిధ గ్రూపులతో సమావేశాలు (మిలన్, సంవాద్‌), ఇంటింటికీ వెళ్లడం,ౖ సోషల్‌ మీడియా (వాట్సాప్‌), ప్రచార, ప్రసార (ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా) తదితర రూపాల్లో అభిప్రాయ సేకరణ జరపనున్న ట్టు చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో సూచనల పెట్టె (సజెషన్స్‌ బాక్సులు) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ గ్రూపులతో సమా వేశాలకు సంబంధించి.. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో మార్చి 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.

శక్తికి తగ్గట్టుగా విరాళాలివ్వండి
ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, స్వయం సహాయక బృందాలు, రైతులు, సహకార సంఘాలు, కార్మికులు, జాతీయ అవార్డుల విజేతలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు తదితరుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని కిషన్‌రెడ్డి వివ రించారు. కళాకారులు, వ్యాపారులు, ఉద్యోగులు, అన్ని రకాల చేతి వృత్తుల కళాకారులు, సఫాయీ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, పూజా రులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, దళిత సంఘాల నాయకులు, సోషల్‌ మీడియాను ప్రభావితం చేసేవారు.. ఇలా అన్ని వర్గాల ఇంటింటికీ వెళ్లి అభి ప్రాయాలు సేకరిస్తామన్నారు. ‘ప్రజలతో నడిచే పార్టీ బీజేపీ కోసం ప్రజల శక్తికి తగ్గట్లుగా ఆర్థిక సాయం చేయాలని అన్ని వర్గాల ప్రజలను కోరుతు న్నాం. నమో యాప్‌ ద్వారానే పార్టీకి ఆర్థిక సాయం చేయాలి..’అని విజ్ఞప్తి చేశారు. ఈ యాప్‌ ద్వారా తాను స్వయంగా పార్టీకి విరాళం పంపారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)