Breaking News

ఇంకెన్నాళ్లు బీఆర్‌ఎస్‌కు దోచిపెడతారు?

Published on Fri, 09/05/2025 - 02:54

కొత్తపల్లి (కరీంనగర్‌): గ్రానైట్‌ వ్యాపారులు గత 20 ఏళ్లుగా బీఆర్‌ఎస్‌ పార్టీకి దోచిపెడుతూనే ఉన్నారని, ఇలా ఇంకెన్నాళ్లు దోచిపెడతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఒక్కో గ్రానైట్‌ కటింగ్‌ మిషన్‌ ఇండస్ట్రీ నుంచి సభ్యత్వం పేరుతో గ్రానైట్‌ అసోసియేషన్‌ రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలదాకా.. దాదాపు 350 నుంచి 500 షాపుల వరకు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం ఉందని, ఆ సొమ్మును ఏం చేశారో చెప్పాలని అన్నారు. 

గ్రానైట్‌ వ్యాపారుల నుంచి రూ.వెయ్యికోట్లు తీసుకున్నట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేసినా ఎవరూ ఖండించలేదని వ్యాపారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియెజకవర్గంలోని మానకొండూర్, చింతకుంటలో గురువారం గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సంజయ్‌కు పలువురు గ్రానైట్‌ వ్యాపారులు ఎదురుపడ్డారు. 

ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లొచ్చాక ఆ దేశంతో వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయని, గ్రానైట్‌ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని అసోసియేషన్‌ నేతలు చెప్పగా.. సంజయ్‌ స్పందిస్తూ కనీసం ప్రెస్‌మీట్‌ పెట్టి మోదీకి థ్యాంక్స్‌ అయినా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? అంటూ నిలదీశారు. 20 ఏళ్లుగా బీఆర్‌ఎస్‌కు దోచిపెడుతూనే మీలో కొందరు వ్యాపారాల కోసం రాజకీయాలను వాడుకుంటుండగా.. మరికొందరు రాజకీయ నాయకులై వ్యాపారాలను పెంచుకుంటూ ఆ సొమ్ముతో రాజకీయాలు చేస్తూ.. మాలాంటోళ్లను ఓడగొట్టాలని చూస్తార ని చురకలంటించారు. 

గ్రానైట్‌ అసోసియేషన్‌ కేంద్రానికి చెల్లించింది రూ. 300 కోట్లకు మించి లేదని, కానీ రూ.వెయ్యి కోట్లు ఇచి్చనట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహించారు. ఎవ్వరికీ పైసలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితిని కల్పిస్తానని, సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలని సంజయ్‌ సూచించారు. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)