Breaking News

Bandi Sanjay: మస్కా బన్ తిని.. చాయ్‌ తాగి!

Published on Sat, 10/26/2024 - 07:53

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా హిమాయత్‌  నగర్‌లోని నీలోఫర్‌ కేఫ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ బీజేపీ ఆధ్వర్యంలో మూసీ బాధితుల పక్షాన ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా అనంతరం ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ప్రకాశ్‌ రెడ్డి, రాష్ట్ర నాయకులు లంకల దీపక్‌ రెడ్డి, డాక్టర్‌ పుల్లారావు యాదవ్‌తో కలిసి నీలోఫర్‌ కేఫ్‌కు వచ్చారు. 

సాదాసీదాగా కేఫ్‌లోకి వెళ్లి కూర్చుని ‘మస్కాబన్‌’ తిన్నారు. ఛాయ్‌ తాగారు. బండి సంజయ్‌ వచ్చారని తెలుసుకున్న నీలోఫర్‌ కేఫ్‌ యజమాని బాబూరావు అక్కడికి వచ్చి పరిచయం చేసుకున్నారు. తాము ఈ మధ్య చిట్టిముత్యాలతో తయారు చేసిన సాంబార్‌ రైస్‌ను బాబూరావు అభ్యర్థన మేరకు సంజయ్‌ రుచిచూసి బాగుందని పేర్కొన్నారు.

 కేఫ్‌కు నీలోఫర్‌ పెట్టడానికి కారణమేంటని ప్రశ్నించడంతో.. ‘తాను చాలా పేదరికం నుండి వచ్చానని, 1976లో నీలోఫర్‌ ఆస్పత్రి వద్ద రూ.2 రూపాయలకు చిన్న ఉద్యోగం చేసి.. అక్కడే టీ, బిస్కట్లు అమ్మానని, వాటికి గిరాకీ ఉండటంతో కేఫ్‌ స్థాపించానని తెలిపారు. అందుకే నీలోఫర్‌కు వచ్చే రోగులకు తనవంతు సహకారం అందిస్తున్నాని తెలపడంతో బండి సంజయ్‌ బాబూరావును ప్రత్యేకంగా అభినందించారు.

 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)