మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి
Breaking News
ఉదయ్.. హైదరాబాద్ విద్యార్థే!
Published on Tue, 07/21/2026 - 11:48
అమెరికాకు చెందిన ప్రఖ్యాత కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)గా నియమితులైన తెలుగు తేజం ఉదయ్ రుద్దర్రాజు మన హైదరాబాద్, మణికొండ విద్యార్థే కావడం విశేషం. ప్రపంచ స్థాయి ఏఐ నమూనాలకు అవసరమైన అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, భారీ కంప్యూటింగ్ వ్యవస్థల అభివృద్ధి, నిర్వహణకు నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్న ఉదయ్... గండిపేటలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) పూర్వ విద్యార్థి.
2011లో ఆయన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అనంతరం కంప్యూటింగ్, కృతిమ మేధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సాంకేతిక నిపుణుడిగా ఎదిగారు. తాజాగా భవిష్యత్ కృత్రిమ మేధస్సు సాంకేతికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అత్యంత కీలక అవకాశం అందుకున్నారు. ఉదయ్ సాధించిన ఘనత ఎంతో గర్వకారణమని ప్రిన్సిపాల్ సీవీ నరసింహులు అన్నారు.
Tags : 1