Breaking News

రోడ్డు ప్రమాదంలో ర్యాపిడ్‌ డ్రైవర్‌, వైద్యుడు మృతి

Published on Mon, 10/13/2025 - 10:56

పంజగుట్ట(హైదరాబాద్‌): లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. యువ వైద్యుడితో పాటు ర్యాపిడో డ్రైవర్‌ను బలి తీసుకుంది. ఆదివారం తెల్లవారు జామున బేగంపేట వైట్‌హౌస్‌ సమీపంలో లారీ ఢీకొన్న దుర్ఘటనలో ర్యాపిడో డ్రైవర్, బైక్‌ వెనక కూర్చున్న యువ వైద్యుడు మృతి చెందారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా హవేలీ రూరల్‌కు చెందిన ముద్దంగల్‌ నవీన్‌ (30) నగరంలో జేఎన్‌టీయూ సమీపంలో నివసిస్తూ ర్యాపిడో బైక్‌ నడుపుతున్నాడు.

 కరీంనగర్‌ జిల్లా ధర్మపురికి చెందిన డాక్టర్‌ కస్తూరి జగదీష్‌ చంద్ర (35) బేగంపేట కిమ్స్‌– సన్‌షైన్‌ ఆస్పత్రిలో జనరల్‌ ఫిజీషియన్‌ చేస్తూ.. బేగంపేటలోని కుందన్‌బాగ్‌లో నివాసం ఉంటాడు. ఆదివారం తెల్లవారు జామున విధులు ముగించుకున్న జగదీష్‌ చంద్ర ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బైక్‌ బుక్‌ చేసుకున్నాడు. నవీన్‌ తన యాక్టివా బైక్‌పై బేగంపేట ఫ్లైఓవర్‌ దిగి క్యాంపు కార్యాలయం ముందు నుంచి యూటర్న్‌ చేసుకుని గ్రీన్‌ల్యాండ్స్‌ వైపు వెళ్తున్నాడు. 

ఇదే సమయంలో యూసుఫ్‌గూడ బస్తీ నుంచి భద్రాచలం వెళ్తున్న ఇసుక లారీ బేగంపేట బ్రిడ్జి పైకి వస్తోది.  గ్రీన్‌ల్యాండ్స్‌ సిగ్నల్‌ దాటగానే లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్‌ నడుపుతున్న నవీన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న డాక్టర్‌ జగదీష్‌ చంద్రను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.    నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకోట్టపల్లికి చెందిన లారీ డ్రైవర్‌ శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)