Breaking News

​HYD: ఇద్దరి ప్రాణం తీసిన గాలిపటాలు

Published on Sun, 01/14/2024 - 21:19

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండగ పూట గాలిపటాల సరదా రాజధాని నగరంలో ఇద్దరి ప్రాణాలు తీసింది. రోడ్డుపై వెళుతూ చైనా మాంజా దారం తగిలి ఆర్మీ లో డ్రైవర్‌గా పని చేసే కోటేశ్వేర్ రెడ్డి మృతి చెందాడు. మరో ఘటనలో గాలిపటం ఎగురవేస్తూ అల్వాల్‌ పీఎస్‌లో పనిచేసే ఏఎస్సై కుమారుడు ఆకాష్‌ ఇంటిపై నుంచి కిందపడి మరణించాడు. దీంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. 

శనివారం సాయంత్రం ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తున్న సమయంలో లంగర్‌హౌజ్‌స్ ఫ్లైఓవర్‌పై అడ్డుగా ఉన్న చైనా మాంజా మెడకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డ కోటేశ్వర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కోటేశ్వర్‌రెడ్డి స్వస్థలం విశాఖపట్నం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

వేరే ఘటనలో గాలిపటం ఎగురవేస్తూ, ప్రమాదవశాత్తు భవనం పైనుండి పడి ఆకాష్‌(20) అనే యువకుడు మృతి చెందాడు. పేట్‌ బహీరాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పండుగ రోజు కుమారుడు మృతి చెందడంతో ఆకాష్‌ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సహచర ఉద్యోగి కుమారుడు మృతి చెందడంతో అల్వాల్ పోలీసుస్టేషన్‌లోలోనూ విషాద చాయలు అలుముకున్నాయి. 

ఇదీచదవండి.. తెలంగాణలో హత్యా రాజకీయాలు చెల్లవు: కేటీఆర్‌ 

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)