Breaking News

దుర్గమ్మ.. ఈ స్నేహితులపై దయ లేదా..!

Published on Mon, 03/10/2025 - 11:20

నార్కట్‌పల్లి(నల్లగొండ): దైవ దర్శనానికి వెళ్తుండగా నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందారు. నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా ఓల్డ్‌ అల్వాలకు చెందిన ఐదుగురు స్నేహితులు ప్రవీణ్, సాయికుమార్‌ గౌడ్, చిల్లాసాగర్‌ సాయి సందీప్‌ గౌడ్, హరీష్, మధుకర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారి దైవ దర్శనం కోసం ప్రవీణ్‌ కారులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత1:30గంటల సమయంలో బయలు దేరారు. 

ఆదివారం తెల్లవారు జామున 5:30గంటల సమయంలో మార్గమధ్యంలోని నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామ శివారులో గల హైదరాబాద్‌– విజయవాడ జాతీయ ప్రధార రహదారి వద్ద రోడ్డు పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారులో ప్రయాణిస్తున్న కుంచ సాయికుమార్‌ గౌడ్‌(32), సాయిసందీప్‌ గౌడ్‌ (23)  అక్కడికక్కడే మృతి చెందారు. హరీష్, మధుకర్‌లకు గాయాలయ్యాయి. డ్రైవింగ్‌ చేస్తున్న ప్రవీణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. 

సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు. తెల్లవారు జామున పొగ మంచు కమ్ముకోవడంతోపాటు, నిలిచి ఉన్న లారీకి వెనుక భాగంలో రెడ్‌ స్టిక్కర్‌ కూడా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)