Breaking News

23 గజాలు రెండు అంతస్తుల భవనం

Published on Tue, 04/01/2025 - 12:56

హనుమకొండ: సొంత ఇంటి కల నెరవేరాలంటే.. అందుకు తగిన స్థలం ఉండాలి. కనీసం 100 గజాల జాగా లేకపోతే సౌకర్యవంతమైన ఇల్లు కట్టలేం. కానీ ఓ వ్యక్తి 23 గజాల స్థలంలోనే రెండతస్తుల ఇల్లు నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా పరకాల (Parakala) పట్టణంలోని 22వ వార్డుకు చెందిన ఫార్మసీ ఉద్యోగి కాపర్తి రాజు తల్లి భారతమ్మ పెంకుటింట్లో నివాసం ఉండేది. 

కాగా రాజు కుమారుడు దత్తు అదే స్థలంలో తన నానమ్మ కోసం సొంత ప్లాన్‌తో రూ.7 లక్షలు ఖర్చు పెట్టి, 23 గజాల స్థలంలోనే రెండు అంతస్తుల ఇల్లు నిర్మించాడు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో పార్కింగ్, స్టోర్‌ రూం, మొదటి అంతస్తులో వంటగది, డైనింగ్‌ హాల్, రెండో అంతస్తులో అటాచ్డ్‌ బాత్‌రూంతో బెడ్‌రూమ్‌ నిర్మాణం చేసి స్థానికులనే కాక ఇంజనీర్లను సైతం ఆశ్చర్యపడేలా చేశాడు. 

సెంచరీ బనానా సెలబ్రేషన్‌
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని గొర్లోనిబాయి గ్రామంలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంబుల లచ్చమ్మకు సోమవారంతో 100 సంవత్సరాలు నిండాయి. ఈ క్రమంలో ఉగాది పండుగ సందర్భంగా ఐదుగురు కుమారులు బాలకృష్ణయ్య, రాములు, వెంకటయ్య, భీమన్న, సుఖ్‌దేవ్‌తోపాటు పుట్టింటికి వచ్చిన ఆమె ముగ్గురు కుమార్తెలు, మనవళ్లు, మునిమనవళ్లు అరటిపండ్లతో తులాభారం నిర్వహించారు. తల్లిదండ్రులను భారంగా చూసే ఈ రోజుల్లో అమ్మకు వందేళ్ల పండుగ నిర్వహించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈమె వంశాంకురంగా 65 మంది ఉండటం విశేషం.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)