యూరియాపై బీఆర్‌ఎస్‌ బూటకపు ప్రచారం

Published on Mon, 02/09/2026 - 01:56

సాక్షి, హైదరాబాద్‌: యూరియా విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రైతాంగాన్ని రెచ్చగొట్టే దిగజారుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రైతులు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడుతున్నారని బీఆర్‌ఎస్‌ పదే పదే చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో రాష్ట్ర రైతాంగానికి బాగా తెలుసని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదీ కూడా రైతులు గమనిస్తున్నారని మంత్రి తెలిపారు.

సిద్దిపేట, గజ్వేల్‌ ప్రాంతాల్లో యూరియా కోసం క్యూ లైన్లలో రైతులు నిలబడి ఇబ్బందులు పడిన ఘటనలు, క్యూ లైన్లలో రైతులు మరణించిన దుర్ఘటనలు కూడా బీఆర్‌ఎస్‌ నేతలు మర్చిపోయారని విమర్శించారు. వరి బోనస్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ నేతలకు ఉందా అని ప్రశ్నిస్తూ, ‘వరి వేస్తే ఉరి’అన్న మాటలు గుర్తు చేశారు.

గత వానాకాలంలో కేంద్రం నుంచి సకాలంలో ఎరువులు అందక రైతులు ఇబ్బంది పడితే, ఆ పరిస్థితిని రాజకీయ లబ్ధికి వాడుకున్నారని, అయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో రైతులు బీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. పత్తి రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘కపాస్‌ కిసాన్‌ యాప్‌’విజయవంతమవడంతో అదే తరహాలో యూరియా యాప్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు. యాప్‌ అమలులో ఉన్న జిల్లాల రైతులను అడిగి తెలుసుకోవాలని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని తుమ్మల స్పష్టం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)